
ఏఐ ఈ రెండు అక్షరాలు నేడు ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త సాంకేతికతను ప్రతి ఒక్క రంగం అందిపుచ్చుకుంటోంది. స్కూల్ పిల్లల మొదలు గేమ్స్ వరకు అంతా విస్తరించింది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక బడ్జెట్ ను రూపొందించింది. నేడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో రూ. 10,371.92 కోట్లతో జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్ కు శ్రీకారం చుట్టింది.

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మొదలు పెద్ద పెద్ద పారిశ్రమల వరకు అన్నింటా తానై, అన్నీ తానై ఈ సాంకేతికత విప్లవంలా దూసుకుపోతోంది. దీనిని ఉపయోగించడం ద్వారా అనేక ఐటీ సంస్థలు ఆధునికతను మరింత అందిజుచ్చుకుంటున్నాయి.

దీనిని అందిపుచ్చుకొని మరిన్ని గొప్ప విజయావకాశాలు సాధించాలని భారత ప్రధాని చాలా సార్లు ప్రస్తావించారు. అందుకు అనుగుణంగా నేడు ఈ సరికొత్త నిర్ణయానికి ఆమోదం తెలిపారు.

'మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా' అనే విజన్ తో భారత్ సాంకేతిక పరంగా అత్యున్నత శిఖరాన్ని చేరాలని సంకల్పించారు ప్రధాని. ఈ మిషన్ ను ప్రవేశ పెట్టడం ద్వారా విద్య, వైద్య, పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అద్భుతాలు సాధించవచ్చన్నారు.