- Telugu News Photo Gallery Technology photos Buy Rs 50k smart TV at Rs 20k Huge discount on iFFALCON 108 cm smart TV Telugu Tech News
Smart TV: రూ. 50 వేల స్మార్ట్ టీవీని రూ. 20 వేలకే సొంతం చేసుకునే అవకాశం.. ఫీచర్లపై ఓ లుక్కేయండి
ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ టీవీల సందడి బాగా పెరిగింది. ఒకప్పుడు లక్షల్లో పలికిన స్మార్ట్ టీవీల ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. కంపెనీల మధ్య పెరిగిన పోటీ, రోజుకో కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తుండడంతో స్మార్ట్ టీవీల ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. దీంతో బడా కంపెనీలు సైతం స్మార్ట్ టీవీల ధరలను తగ్గించాయి. ఇక వీటికి అదనంగా ఈకామర్స్ సైట్స్ సైతం టీవీలపై అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నాయి. తాజాగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఓ టీవీపై సూపర్ ఆఫర్ లభిస్తోంది. రూ. 50 వేల స్మార్ట్ ఫోన్‌ను ఏకంగా రూ. 22 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ టీవీ ఏంటి.? దాని ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Aug 18, 2023 | 4:44 PM

iFFALCON స్మార్ట్ టీవీపై ఊహకందని ఆఫర్ లభిస్తోంది. 43 ఇంచెస్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్‌ఈడీ గూగుల్ టీవీ అసలు ధర రూ. 49,990కాగా ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 21,999కే సొంతం చేసుకోవచ్చు.

అంతేకాకుండా కొన్ని రకాల ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. 2000 వేల డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో అన్ని ఆఫర్లు కలిపితే ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీని రూ. 20 వేలలోపే సొంతం చేసుకోవచ్చు.

ధర తక్కువ కాబట్టి ఫీచర్లు తక్కువ ఉంటాయనే సందేహమే లేదు, ఎందుకంటే ఫీచర్స్ విషయంలో కాంప్రమైజ్ లేకుండా రూపొందించారు. ఈ స్మార్ట్ టీవీలో 3840 x 2160 పిక్సల్ రిజల్యూషన్‌తో 4K అల్ట్రా HD డిస్‌ప్లేను ఇచ్చారు. 60 Hertz రిఫ్రెష్ రేట్ ఈ టీవీ స్క్రీన్ సొంతం.

అంతేకాకుండా ఇందులో డాల్బీ ఆడియో సౌండ్ సిస్టమ్‌ను అందించారు. ఇక ఈ టీవీ 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజీతో వస్తుంది. ఒక ఏడాది వారంటీ కూడా అందిస్తున్నారు.

ఇక ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 64 బిట్ క్వార్డ్ కోర్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ వంటి ఇన్‌బిల్ట్ ఓటీటీ యాప్‌లు అందించారు.




