
కారు ఉంటే ఎన్నో సౌలభ్యాలు ఉంటాయి. అది మీ స్టేటస్‌కు, లగ్జరీ లైఫ్ స్టైల్‌కు సింబల్ ఉంటుంది. ఇవే కాదు.. దాని మెయిటేనెన్స్, ఇంధన ఖర్చులు కూడా అంత రేంజ్‌లో ఉంటాయి. పెరుగుతున్న ఇంధన ఖర్చు, ట్రాఫిక్ కారణంగా తగ్గుతున్న మైలేజ్ గురించి మీరు ఆందోళన చెందాలి. మీ జేబులో నుండి అదనంగా ఏమీ ఖర్చు చేయకుండా.. మీరు కారు మైలేజ్ పెంచుకోవాలని మీరు ఆలోచిస్తుంటే.. జస్ట్ ఈ సింపుల్ టిప్స్ పాటించండి చాలు.

స్మూత్ డ్రైవింగ్.. అకస్మాత్తుగా యాక్సిలరేటర్ నొక్కడం లేదా పదే పదే యాక్సిలరేట్ చేయడం, తగ్గించడం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల మైలేజీని మెరుగుపరచడానికి మొదటి, సులభమైన మార్గం కారును సజావుగా, నెమ్మదిగా వేగవంతం చేయడం. గేర్ షిఫ్టింగ్.. సరైన సమయంలో గేర్ మార్చడం కారు మైలేజ్ కి, దాని మొత్తం ఫిట్‌నెస్‌కి చాలా ముఖ్యం. ఎందుకంటే, కారును ఎక్కువసేపు తక్కువ గేర్‌లో అధిక వేగంతో ఉంచడం లేదా తక్కువ వేగంతో ఎక్కువ గేర్‌లో ఉంచడం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఎక్కువ ఇంధనాన్ని కాల్చేస్తుంది.

గేర్లు ఎప్పుడు మార్చాలి?.. పెట్రోల్ కార్లలో 2000–2500 RPM వద్ద, డీజిల్ కార్లలో 1500–2000 RPM వద్ద గేర్లు మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో వేగాన్ని బట్టి గేర్లు మార్చడం కూడా ముఖ్యం. ఉదాహరణకు మొదటి గేర్‌ను 0-10 కిమీ/గం వద్ద, రెండవ గేర్‌ను 10-20 వద్ద, మూడవ గేర్‌ను 20-35 వద్ద, నాల్గవ గేర్‌ను 35-50 వద్ద మరియు 5వ గేర్‌ను 50 కిమీ/గం కంటే ఎక్కువ వేగంతో మార్చాలి. ఎక్కువసేపు బ్రేక్ వేసినప్పుడు ఇంజిన్ ఆఫ్ చేయండి.. ట్రాఫిక్ సిగ్నల్ లేదా రైల్వే క్రాసింగ్ వద్ద 30 సెకన్ల కంటే ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తే, ఇంజిన్ ఆఫ్ చేయడం మంచిది. ఇది ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది, మైలేజీని పెంచుతుంది.

టైర్ ప్రెజర్, క్రూజింగ్ వేగం.. కారు టైర్లలో గాలి సరిపోను ఉందా లేదా చూసుకోవడం ముఖ్యం. కనీసం వారానికి ఒకసారి టైర్లలో గాలిని తనిఖీ చేయాలి. మీరు హైవేపై ఎక్కువగా డ్రైవ్ చేస్తే, 1-3 PSI ఎక్కువగా ఉంచుకోవడం మంచిది. దీనితో పాటు పెట్రోల్ కార్లకు 80–90 కి.మీ/గం వేగం ఉత్తమం. ఇది మైలేజీని స్థిరంగా, మెరుగ్గా ఉంచుతుంది. AC వినియోగం.. ఇంజిన్‌ను చాలా చల్లగా ఉంచడం లేదా పార్కింగ్ చేసిన వెంటనే AC ఆన్ చేయడం వల్ల మైలేజ్ దెబ్బతింటుంది. ముందుగా కారు నుండి వేడి గాలిని బయటకు వదిలేసి, ఆ తర్వాత AC ఆన్ చేయడం మంచిది. ట్రాఫిక్‌లో తరచుగా స్టార్ట్ చేయడం, ఆపడం వల్ల కూడా ఇంధనం వృధా అవుతుంది, కాబట్టి సజావుగా డ్రైవింగ్ చేయడంపై దృష్టి పెట్టండి.

మైలేజ్ పెంచడానికి అదనపు అలవాట్లు.. ప్రతి ఫుల్ ట్యాంక్ తర్వాత మైలేజీని గమనించండి, ఇది వాహనం ఆరోగ్యాన్ని చూపుతుంది. విశ్వసనీయ పెట్రోల్ పంప్ నుండి మాత్రమే ఇంధనం నింపండి, ఎందుకంటే నాణ్యత పనితీరును నేరుగా ప్రభావితం చేస్తుంది. CNG కార్ల యజమానులు నెలకు ఒకసారి పెట్రోల్‌పై ఎక్కువసేపు డ్రైవ్ చేయాలి, ఇది ఇంజిన్‌ను శుభ్రంగా, మృదువుగా ఉంచుతుంది.