
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రైమ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్ డే సేల్ పేరుతో సేల్‌ను నిర్వహించనుంది. జులై 20, 21వ తేదీల్లో ఈ సేల్ ఉండనుంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. మరి ఈ సేల్‌లో భాగంగా రూ. 40వేల లోపు అందుబాటులోకి వస్తున్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్‌లు, వాటి ఫీచర్లకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేయండి.

Google Pixel 7a: ఈ సేల్‌లో లభిస్తోన్న మరో బెస్ట్ డీల్స్‌లో ఇదీ ఒకటి. గూగుల్ పిక్సెల్ 7ఏ ప్రారంభ వేరియంట్‌ను రూ. 36,999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. 64 ఎంపీ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 13 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

iQOO Neo 9 Pro: ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ ధరూ. 35,999కి లభిస్తోంది. అయితే సేల్‌లో భాగంగా ఇంకా తక్కువకే సొంతం చేసుకునే అవకాశం ఉంది. బెస్ట్ ప్రీమియం ఫోన్స్‌లో ఇదీ ఒకటి. ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ ఫోన్ సొంతం. ఇక ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5160 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

OnePlus 12R: రూ. 40 వేలలోపు అందుబాలో ఉన్న బెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌లో వన్‌ప్లస్ 12 ఆర్ ఒకటి. ఈ ఫోన్‌పై మంచి డీల్ లభిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ ప్రో ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెచ్‌జెడ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 50 ఎంపీ రెయిర్ కెమెరాను ఇందులో ఇచ్చారు. 100 వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

Realme GT 6: రూ. 40 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో రియల్ మీ జీటీ 6 ఫోన్ ఒకటి. ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ రూ. 38 వేలుగా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 ఎంపీతో కూడి రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌టీపీఓ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు.