iQOO 9 SE: ఐకూ 9 సీఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ. 28,990గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 ఇంచెస్ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 48 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇక ఇందులో 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
iQOO Neo 6: అమెజాన్ సైట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ రూ. 27,999గా ఉంది. స్క్రీన్ విషయానికొస్తే 6.62 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ 870 5జీ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇందులో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. 4700 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో కూడిన బ్యాటరీని అందించారు. ఇందులోని ప్రాసెసర్ గేమ్స్‌కి సపోర్ట్ చేస్తుంది.
Poco F4 5G: పోకో ఎఫ్4 5జీ, 6 జీబీ ర్యామ్ 128 జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 27,999గా ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్ గేమ్స్‌కి పర్‌ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇందులో 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. 6.67 ఇంచెస్ ఈ4 అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు.
Redmi Note 12 Pro: రూ. 30 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో రెడ్‌మీ నోట్ 12 ప్రో మొదటి ప్లేస్‌లో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 24,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.
Samsung Galaxy S20 FE: గేమ్స్‌కి సపోర్ట్ చేసే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్20 ఎఫ్‌ఈ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్నాప్‌డ్రాగన్ 856 ప్రాసెసర్ గేమ్స్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్ రూ. 29,990గా ఉంది.