
బ్లూస్టార్ ఏసీలు ఎక్కువ కాలం పనిచేసే సామర్థ్యం కలిగి ఉండడంతో, వాటి అమ్మకాలు మన దేశంలో జోరుగా జరుగుతున్నాయి. ఈ కంపెనీ నుంచి 3 స్టార్ రేటింగ్ తో విడుదలైన 1.5 టన్ స్ల్పిట్ ఏసీకి ప్రజల ఆదరణ బాగుంది. 4 కన్వర్టిబుల్ మోడ్, 4- వే స్వింగ్ టెక్నాలజీ, వై-ఫై కనెక్టివిటీ సౌకర్యం దీని ప్రత్యేకతలు. ఉష్ణోగ్రత, ఫ్యాన్ వేగాన్ని మీ స్మార్ట్ ఫోన్ ద్వారా వాయిస్ కమాండ్ లను ఉపయోగించి నియంత్రణ చేయవచ్చు. దీనిలోని స్మార్ట్ డిజిక్యూ హెప్టా సెన్సార్లను ఉపయోగించి అత్యంత కఠినమైన ఎండల్లో కూడా హాయిగా చల్లదనాన్ని పొందవచ్చు. అమెజాన్ లో రూ.37,490కు ఈ ఏసీ అందుబాటులో ఉంది.

భారతీయులకు అత్యంత నమ్మకమైన ఎల్ జీ బ్రాండ్ నుంచి విడుదలైన 1.5 టన్ 5 స్టార్ స్ప్లిట్ ఏసీ అమ్మకాల్లో దూసుకుపోతోంది. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ చల్లదనం అందించడం దీని ప్రత్యేకత. సుమారు 150 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన మీడియం సైజు గదులకు చక్కగా సరిపోతుంది. 5000 డబ్ల్యూ శక్తివంతమైన శీతలీకరణ సామర్థ్యం, డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్, 6 కన్వర్టిబుల్ మోడ్ లు, 55 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ చల్లదనాన్ని అందించడం దీని ప్రత్యేకతలు. 15 మీటర్ల పొడవైన ఎయిర్ త్రో పరిధితో గది అంతా ఒకే విధమైన చల్లదనాన్ని అందిస్తుంది. అధిక నాణ్యత గల రాగి కండెన్సర్ కాయిల్, తుప్పు నిరోధానికి ప్రత్యేక ఓషన్ బ్లాక్ రక్షణ వ్యవస్థ ఉన్నాయి. ఈ ఏసీ రూ.45,990కి అమెజాన్ లో అందుబాటులో ఉంది.

మీడియం సైజు గదులకు అనువైన ఏసీలలో పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ప్రీమియం ఏసీ ముందుంటుంది. గది నలుమూలలకు చల్లదనాన్ని పంపిస్తుంది. ఏడు కన్వరిబుల్ మోడ్ లు, తక్కువ విద్యుత్ వినియోగం, 5100 డబ్ల్యూ కూలింగ్ సామర్థ్యం, 4 వే స్వింగ్ టెక్నాలజీ, రాగి కండెన్సర్ కాయిల్, యూనిట్ తుప్పు పట్టకుండా చూసే ప్రత్యేక షీల్డ్ బ్లూప్లస్ రక్షణ వ్యవస్థ దీని ప్రత్యేకతలు. వై-ఫై కనెక్టివిటీతో కూడిన ఈ స్మార్ట్ ఏసీని వాయిస్ తో నియంత్రణ చేయవచ్చు. మీ స్మార్ట్ ఫోన్ లోని యాప్ ద్వారా కస్టమ్ స్లీప్ ప్రొఫైల్ రూపొందించటానికి, సర్వీస్ రిక్వెస్టులు పంపడానికి వీలుంటుంది. అమెజాన్ లో ఈ ఏసీని రూ. 46,990కి కొనుగోలు చేసుకోవచ్చు.

చిన్న గదులకు సరిపడే ఏసీ కావాలనుకునే వారికి సామ్సంగ్ 1 టన్ 3 స్టార్ డిజిటల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ బాగుంటుంది. సుమారు 111 చదరపు అడుగుల గదులకు చక్కగా సరిపోతుంది. ఈ ఏసీ వేరియబుల్ స్పీడ్ ఇన్వర్టర్ కంప్రెసర్ పై నడుస్తుంది. 5 కన్వర్టిబుల్ మోడ్, 3 స్టార్ రేటింగ్, తుప్పును నిరోధించే టెక్నాలజీ, ధీర్ఘకాలం మన్నికగా ఉండే అధిక నాణ్యత కలిగిన రాగి కండెన్సర్ కాయిల్, దుమ్ము, ఇతర హానికరమైన బ్యాక్టీరియా నుంచి రక్షణ కోసం యాంటీ - బ్యాక్టీరియల్ ఫిల్టర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దాదాపు 58 డిగ్రీల సెల్సియస్ ఎండ ఉన్నా చల్లదనాన్ని అందిస్తుంది. అమెజాన్ లో రూ.31,990కి ఈ ఏసీని కొనుగోలు చేయవచ్చు.

తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఏసీ కొనుగోలు చేయాలనుకునే వారు వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీని ఎంపిక చేసుకోవచ్చు. వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ పై నడిచే ఈ ఏసీలో 4 కన్వర్టిబుల్ కూలింగ్ మోడ్ లు ఉన్నాయి. అధిక నాణ్యత కలిగిన రాగి కండెన్సర్ కాయిల్ తో పనితీరుకు ఢోకా ఉండదు. బయటి వాతావరణంతో సంబంధం లేకుండా విద్యుత్ ను ఆదా చేసే యాంటీ - ఫ్రీజ్ థర్మోస్టాట్, తక్కువ శబ్ధంతో పనిచేయడం, వోల్టేజీ హెచ్చుతగ్గులను తట్టుకునే స్టెబిలైజర్ రహిత ఆపరేషన్, టర్బో కూలింగ్ ఎయిర్ ఫ్లో, మెమరీ ఫంక్షన్ తో కూడిన ఆటో రీస్టార్ట్ దీని ప్రత్యేకతలు. అమెజాన్ లో కేవలం రూ.33,990కే ఈ ఏసీని కొనుగోలు చేయవచ్చు.