
realme narzo N53 : రియల్‌మీ నార్జో ఎన్53 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 10,999గా ఉండగా సేల్‌లో భాగంగా రూ. 7999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను ఈఎమ్‌ఐలో నెలకు కేవలం రూ. 388 చెల్లిస్తూ పొందొచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.

Redmi 12C: రెడ్‌మీ 12సీ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 13,999కాగా, 50 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.71 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. 50 ఎంపీ రెయిర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఈ ఫోన్ సొంతం.

Redmi A2: 2జీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 9,999గా ఉండగా సేల్‌లో భాగంగా కేవలం రూ. 5,299కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 16.5 సె.మీతో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్ 4జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేస్తుంది.

Samsung Galaxy M04 Light: ఈ సేల్‌లో రూ.10 వేలలోపు లభిస్తున్న మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్‌లో ఇదీ ఒకటి. ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999కాగా సేల్‌లో భాగంగా కేవలం రూ. 6,499కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో పీ35 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అందించారు. 13 ఎంపీ రెయిర్ కెమెరా ఫోన్, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

Samsung Galaxy M13: సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్13 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 14,999కాగా 39 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 9,199కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 ఎంపీ రెయిర్ కెమెరాతోపాటు, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 6.6 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు.