
ఈకామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ పేరుతో ( Amazon Fab Phone Fest ) సేల్‌ను తీసుకొచ్చింది. మార్చి 11న ప్రారంభమైన ఈ సేల్, మార్చి 14వ తేదీ వరకు కొనసాగనుంది.

ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. అమెజాన్ అందించే ఆఫర్లతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇక నో కాస్ట్ ఈఎఎఐతో పాటు, ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

ఈ ఆఫర్‌లో భాగంగా సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎం52 5జీ ఫోన్‌పై ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ రూ. 23,999కి అందుబాటులో ఉంది. ఇక సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎం12 రూ. 3000 డిస్కౌంట్‌తో రూ. 9,999కే అందుబాటులో ఉంది.

సామ్‌సంగ్ ఎం 32 5జీ మొబైల్ రూ. 2000 డిస్కౌంట్‌తో రూ. 20,999కి లభిస్తుంది. వన్‌ప్లస్ 9ఆర్ 5జీ, వన్‌ప్లస్ 9ప్రో ఫోన్లపై 12 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. వన్‌ప్లస్ 9 ఆర్ రూ. 33,999గా ఉంది. వన్‌ప్లస్ 9ప్రో రూ. 56,999కి అందుబాటులో ఉంది.

రెడ్‌మీ 9ఏ స్పోర్ట్ మొబైల్‌పై రూ. 1500 డిస్కౌంట్ అందిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ. 6,999కే అందుబాటులో ఉంది. రెడ్‌మీ నోట్ 10 ఎస్, రూ. 14,499గా ఉంది. వీటితో పాటు మరెన్నో స్మార్ట్ ఫోన్‌లపై భారీ ఆఫర్లు ఉన్నాయి.