
కివి పండ్లను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రంగా మారుతాయి. ఈ పండ్లను తింటే మన శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి ఉశపమనం అందిస్తుంది.

కివి పండ్లలో యాక్టినైడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలో ఉండే ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయం చేస్తుంది. కివి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరిచి బీపీని కంట్రోల్ చేస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది.

ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి గుండెను రక్షిస్తాయి. దీంతో గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. కివి పండ్లలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది.

అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు రోజూ ఒక కివి పండును తింటుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. కివి పండ్లలో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది.

కివి పండ్లలో విటమిన్ ఇ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. దీంతో చర్మ కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. ఫలితంగా చర్మంపై వృద్ధాప్య ఛాయలు రావు. చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది.