Rare Tree Marriage: రావి, వేప చెట్లకు అరుదైన పెళ్లి.. వేడుకను తిలకించేందుకు తరలివచ్చిన సమీప గ్రామాల ప్రజలు..

| Edited By: Janardhan Veluru

Jul 08, 2023 | 11:07 AM

వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లిళ్లు చేయడం వినే ఉంటాం. ప్రతి దేవాలయంలో వేప, రావి చెట్లకు పూజలు చేయడం సహజమే. కానీ సంతానం కలగాలని, దోషాలన్నీ తొలగిపోవాలని కలిసి ఉన్న రావి, వేప చెట్లకు పెళ్లి చేశారు ఓ గ్రామస్తులు. ఈ పెళ్లి వేడుకను తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు తరలివచ్చారు.

1 / 5
వర్షాలు కురవాలని కప్పలకు పెళ్లిళ్లు చేయడం వినే ఉంటాం. ప్రతి దేవాలయంలో  వేప, రావి చెట్లకు పూజలు చేయడం సహజమే. కానీ సంతానం కలగాలని, దోషాలన్నీ తొలగిపోవాలని కలిసి ఉన్న రావి, వేప చెట్లకు పెళ్లి చేశారు ఓ గ్రామస్తులు.

2 / 5
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికంగా ఉన్న పూసల సంఘం కళ్యాణ మండపంలో పెనవేసుకున్న వేప - రావి చెట్లు ఉన్నాయి.

3 / 5
వేప చెట్టును విష్ణువు.. రావి చెట్టు లక్ష్మీదేవిగా భావిస్తుంటారు. దీంతో సంఘం సభ్యులు శుభం కలగాలని వేప - రావి చెట్లకు భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యులతో కలిసి వివాహం జరిపించారు.

4 / 5
 కలిసి ఉన్న వేప - రావి చెట్ల బంధానికి పెళ్లి చేస్తే కుజ దోషం, కాల సర్ప దోషం, నష్ట దోషాలు తొలగి పోతాయని, సంతానం కలుగుతుందని నమ్ముతున్నారు. సాధారణ పెళ్లి మాదిరిగానే పెళ్లి అనంతరం సంఘ సభ్యులు అన్నదానం చేశారు.

5 / 5
రావి, వేప చెట్లకు పెళ్లి కార్యక్రమాన్ని తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.