
పలు అధ్యయనాల ప్రకారం...కొత్తిమీరలో శరీరానికి అత్యవసరమైన విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కొత్తిమీర అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. కొత్తిమీరలోని అంశాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇది కడుపులో వాయువు, అజీర్ణం, వాంతులను తగ్గిస్తుంది.

కొత్తిమీరలో ఉండే విటమిన్ A, C, K వంటివి కళ్ల ఆరోగ్యం, చర్మ సంరక్షణ, ఎముకల బలానికి తోడ్పడతాయి. కొత్తిమీరలో ఫోలేట్, కాల్షియం, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం శరీరానికి శక్తిని అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొత్తిమీర జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా పని చేస్తుంది.

బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి కొత్తిమీర నీరు అద్భుతం చేస్తుంది. ఇందుకోసం కొత్తిమీరను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఫిల్టర్ చేసుకుని తాగితే బరువు తగ్గుతారు. ఇలా రోజుకు రెండుసార్లు తాగాలి. అంతేకాదు.. కొత్తిమీర నీరు తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు కొత్తిమీర నీరు తీసుకోవడం మంచిది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కొత్తిమీర అద్భుత మేలు చేస్తుంది. కొత్తిమీరలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కొత్తిమీర కడుపు నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. కళ్ల మంటలు, కళ్లలో నీళ్లు కారడం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి కొత్తిమీర నీరు మంచి చేస్తుంది.

కొత్తిమీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొత్తిమీరలోని పోషకాలు హార్మోన్ సమతుల్యత కోసం, శరీరంలోని అవయవాలకు బలాని అందిస్తాయి. కొత్తిమీరను ప్రతి రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సమయానికి పీరియడ్స్ రాని వారు కొత్తిమీర నీళ్లలో కొంచెం పంచదార కలిపి తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.