ఒక్క కిలోమీటర్ మంత్రం.. రోజూ నడిస్తే ఎంత కొవ్వు కరుగుతుందో తెలుసా..?

Updated on: Mar 27, 2026 | 9:12 PM

జిమ్‌కి వెళ్లే సమయం లేదా? గంటల తరబడి వర్కవుట్లు చేయడం మీ వల్ల కాదా? అయితే ఒక్క నిమిషం ఆగండి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు కొండలు పగలగొట్టాల్సిన అవసరం లేదు.. కేవలం మీ ఇంటి ముందు ఒక్క కిలోమీటరు నడిస్తే చాలు. ఒక్క కిలోమీటరు నడవడం వల్ల మీ గుండె, మనస్సు, జీవక్రియలో వచ్చే మార్పులు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.

1 / 5
ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, గంటల తరబడి కుర్చీకే పరిమితం కావడం, సమయం లేకపోవడం వల్ల వ్యాయామం అనేది చాలా మందికి అసాధ్యంగా మారింది. దీనివల్ల చిన్న వయసులోనే గుండె జబ్బులు, ఒత్తిడి వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే వీటన్నింటికీ విరుగుడుగా రోజూ కేవలం ఒక కిలోమీటర్ నడకతో మీ ఆరోగ్య ప్రయాణాన్ని ప్రారంభించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

2 / 5
చిన్న అడుగు.. పెద్ద మార్పు: నడక అనేది ఎటువంటి ఖర్చు, ప్రత్యేక పరికరాలు అవసరం లేని అత్యంత సులభమైన వ్యాయామం. సీనియర్ డైటీషియన్ డాక్టర్ గీతిక చోప్రా అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ 1 కిలోమీటరు నడవడం చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ నిశ్చల జీవనశైలి నుండి బయటపడటానికి ఇది ఒక అద్భుతమైన ప్రారంభం.

3 / 5
రోజూ నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జీవక్రియను ఉత్తేజపరిచి, రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది. నడిచే సమయంలో శరీరంలో ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, మనసుకు ప్రశాంతతను, ఉల్లాసాన్ని ఇస్తాయి. గంటల తరబడి కూర్చోవడం వల్ల వచ్చే ఒళ్లు నొప్పులు, కండరాల బిగువును తగ్గించడంలో ఈ కొద్దిపాటి నడక ఎంతో సహాయపడుతుంది.

4 / 5
బరువు తగ్గాలనుకునే వారు: కేవలం 1 కిలోమీటరు నడక వల్ల సుమారు 40 నుండి 60 కేలరీలు మాత్రమే ఖర్చవుతాయి. కాబట్టి కేవలం బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు నడకతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం, క్రమంగా నడక దూరాన్ని పెంచడం అవసరం.

5 / 5
ఆరోగ్యకరమైన గుండె కోసం, పూర్తి ఫిట్‌నెస్ కోసం రోజుకు కనీసం 30 నిమిషాలు లేదా సుమారు 7,000 అడుగులు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వ్యాయామం అస్సలు చేయని వారు మొదట 1 కిలోమీటరుతో మొదలుపెట్టి, నెమ్మదిగా వేగాన్ని, దూరాన్ని పెంచుకోవడం ఉత్తమ మార్గం.

Follow Us