
బిర్యానీ ఆకుల్లో ఫైటో కెమికల్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి షుగర్‌ను కంట్రోల్ చేస్తాయి. వీటిని తీసుకుంటే టైప్-2 డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన బిర్యానీ ఆకులు.. ఎముకల్లో నొప్పి, వాపును తగ్గిస్తాయి కూడా.

బిర్యాని ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. బిర్యాని ఆకులను తీసుకుంటే ఫ్రీ రాడికల్స్ తొలగుతాయి. జీర్ణ సమస్యలను తొలగించడానికి బిర్యాని ఆకులు పనిచేస్తాయి. బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యల్ని బిర్యానీ ఆకులు తొలగిస్తాయి.

బిర్యాని ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపు, చర్మం ఎరుపెక్కడం వంటి సమస్యలను తొలగిస్తాయి. బిర్యాని ఆకులు తీసుకుంటే ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. బిర్యాని ఆకుల్లో ఉండే పోషకాలు షుగర్‌ను కంట్రోల్ చేస్తాయి. బిర్యాని ఆకులను రెగ్యులర్‌గా తీసుకుంటే టైప్-2 డయాబెటిస్ నుంచి రక్షణ లభిస్తుంది.

బిర్యాని ఆకుల్లో ఉండే పోషకాలు గుండె సమస్యలను దూరం చేస్తాయి. బిర్యాని ఆకులను వివిధ రూపాల్లో తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి బిర్యానీ ఆకులు బాగా ఉపయోగపడతాయి. బిర్యానీ ఆకులను తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయిటకుపోవచ్చు. బిర్యాని ఆకులు తింటే ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

బిర్యానీ ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రుని పోగొట్టి జుట్టు ఎదుగుదలకి తోడ్పడతాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం వంటివి ఇమ్యూనిటీని పెంచుతాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి.