Sugarcane Juice: మీరూ మండే ఎండల్లో చల్లగా చెరకు రసం తాగుతున్నారా? ఓసారి ఇది తెలుసుకోండి

Updated on: Mar 06, 2025 | 8:30 PM

వేసవి నెలల్లో అధిక చెరకు రసం తీసుకోవడం శరీరానికి అంత ఆరోగ్యకం కాదు. చెరకు రసంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వేసవిలో అధికంగా తాగకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎక్కువగా తీసుకుంటే అమృతం కూడా విషపూరితం అవుతుంది. అందువల్ల, ఏదైనా అధికంగా తీసుకోవడం మంచిది కాదు. ఇది చెరకు రసానికి కూడా వర్తిస్తుంది..

1 / 5
శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమైంది. ప్రకృతిలో వేసవి వేడి క్రమంగా పెరుగుతోంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ సాధారణంగా దాహం పెరుగుతుంది. ఇలాంటి సమయాల్లో తరచుగా శీతల పానీయాలు తాగాలని అనిపించడం సహజం. చాలా మంది చెరకు రసం తాగాలని కోరుకుంటారు. ఈ జ్యూస్‌ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దీనిని తరచుగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

2 / 5
Sugarcane Juice

Sugarcane Juice

3 / 5
ఇది మితంగా తీసుకుంటే, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చెరకు రసంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఇనుము, పొటాషియం, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో చెరకు రసం తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యలు తగ్గుతాయి. చెరకు రసంలోని ఖనిజాలు ఎముకలను బలపరుస్తాయి.

4 / 5
శరీరానికి చల్లదనాన్నిచ్చే చెరకు రసం వల్ల కూడా కొన్ని రకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పవంటున్నారు పోషకాహార నిపుణులు.  200ml చెరుకు రసంలో దాదాపు 100 గ్రాముల షుగర్ ఉంటుంది. చెరుకులో ఉండే పోలికోసనాల్ అనే కెమికల్ వల్ల తలనొప్పి, ఊబకాయం, నిద్రలేమి లాంటి సమస్యలు వస్తాయని రీసెర్చ్‌లు చెబుతున్నాయి.

5 / 5
మీకు ఇప్పటికే ఒత్తిడి లేదా నిద్రలేమి సమస్యలు ఉంటే, చెరకు రసాన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకోవటం మంచిది కాదు.. చెరకు రసంలో ఉండే పోలికోసనాల్ నిద్రలేమికి కారణమవుతుంది. దీని కారణంగా ఒక వ్యక్తికి నిద్రలేమి సమస్య ఉండవచ్చు. అంతేకాదు, చెరకు రసం ఎక్కువగా తాగడం వల్ల దంతాలలో పుండ్లు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. చెరకు తీపి వల్ల స్వరపేటిక సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంది.