
నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు జ్యూసీ జ్యూసీగా ఉండటమే కాదు బాగా పండిన పండ్లు పసుపు రంగులోకి మారి తియ్యగా ఉంటాయి. పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి. ఈ స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ ఎ, బి , సి పుష్కలంగా ఉంటాయి. రోజూ స్టార్ ఫ్రూట్స్ తింటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. వికారం, వాంతులు, విరేచనాలు తదితర సమస్యలకు స్టార్ ఫ్రూట్స్ బాగా పనిచేస్తాయి.

స్టార్ ఫ్రూట్స్‌లోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు.. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఈ పండ్లను తరచూ తీసుకుంటుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. స్టార్ ఫ్రూట్స్‌లోని విటమిన్ బి12, జింక్.. జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఈ పండులో ఎక్కువ శాతం ఫైబర్, తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ జీర్ణవ్యవస్థకు మంచిది.

విటమిన్ బి, ఫైబర్ వంటి పోషకాలు స్టార్ ఫ్రూట్‌లో ఉంటాయి. ఇది జీర్ణక్రియ ఆరోగ్యం, స్ట్రోక్, గుండె సమస్యల నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. పండుతో పాటు, దాని ఆకులు కూడా కడుపుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కడుపు పూతలని నయం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అంతే కాదు, ఈ పండు మీ జుట్టును బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది.

అధిక బరువుతో బాధపడేవారు స్టార్ ఫ్రూట్‌లను తీసుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం,స్టార్‌ఫ్రూట్‌లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, ఈ పండుతో బరువు తగ్గవచ్చు. అంతేకాదు స్టార్ ఫ్రూట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది. బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి బీటా-కెరోటిన్ వినియోగం ఉపయోగించబడుతుంది.

స్టార్‌ఫ్రూట్ మీ జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఇందులో పీచు పదార్థం ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

శరీరంలోని కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించవచ్చు. ఎందుకంటే ఈ పండులో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి గుణాలు స్టార్‌ఫ్రూట్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.