
108 ప్రదక్షణలతో కోరిన కోర్కెలు తీర్చి అభయహస్తం ఇస్తూ వీరాజీలుతున్న సోమనాథుడు శ్రీ మహా విష్ణుమూర్తి సౌమ్యనాథ స్వామిగా అవతరించి భక్తులకు అభయహస్తం ఇస్తూ.. కోరిన కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటున్నారు నందలూరులో 108 స్తంభాలపై భాగవతం చిత్రీకరించిన ఈ ఆలయంలో త్రికరణ శుద్ధిగా 108 ప్రదక్షణులు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల అచంచల విశ్వాసం. స్వయంగా దేవతలే నిర్మించిన ఈ ఆలయం విశిష్టతలు తెలుసుకోవాలంటే కడప జిల్లా నందలూరు మండలం స్వామ్యనాథ స్వామి ఆలయానికి వెళ్లాల్సిందే. 11వ శతాబ్దంలో విజయనగర, చోళ, కాకతీయ రాజుల చారిత్రాత్మక కళావైభవం శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం. గర్భగుడిలోని స్వామివారి పాదాలను నేరుగా తాకే సూర్యకిరణాలు ఆలయ నిర్మాణంలోని నైపుణ్యతను సూచిస్తున్నాయి.ఇదే కడప జిల్లా నందలూరులోని శ్రీ శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం.

కడప జిల్లా నందలూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం రాష్ట్రంలోని అత్యంత ప్రాచీన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా చెప్పవచ్చు. 11వ శతాబ్దంలో చోళ చక్రవర్తి కుళోత్తుంగ చోళుడు ఆలయ నిర్మాణానికి పూనుకొన్నట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అనంతరం కాకతీయులు, విజయనగర రాజులు ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసి ఆలయానికి కళా వైభవాన్ని తీసుకువచ్చారు. పద కవితా పితామహుడు తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి సౌమ్యనాథస్వామిపై శృంగార కీర్తనలు రచించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.

పురాణాల ప్రకారం నారద మహర్షి కోరిక మేరకు మహావిష్ణువు బహుదా నది తీరంలో సౌమ్యనాథస్వామిగా శిలారూపంలో వెలిశాడని స్థానికుల విశ్వాసం. ఇది కాకుండా స్వయంగా నారద మహర్షే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. గర్భగుడిలో సుమారు ఏడు అడుగుల ఎత్తైన సౌమ్యనాథస్వామి విగ్రహం చతుర్భుజ రూపంలో పద్మపీఠంపై దర్శనమిస్తారు. ప్రతి ఏడాది సూర్యోదయ సమయంలో తొలికిరణాలు స్వామివారి పాదాలపై పడేలా ఆలయాన్ని నిర్మించడం ఇక్కడి ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఆలయంలో తమిళ, తెలుగు శాసనాలు కూడా ఉన్నాయి.

సనాతన హిందూ ధర్మంలో 108 సంఖ్య విశేష ప్రాధాన్యత సంతరించుకొంది. వేదాల్లో 108 ఉపనిషత్తులు. జపమాలలో ఉన్న పూసలు 108, భగవంతుని నామాలు 108 అంతే కాదు 12 రాశులు × 9 గ్రహాలు = 108.ఇలా ఎ విధంగా చూసిన 108 సంఖ్య అనేక యోగ, ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో పవిత్ర సంఖ్యగా భావిస్తారు హైందవులు. ఈ 108 సంఖ్య కు సౌమ్యనాథ స్వామి ఆలయానికి ఉన్న సంబంధం విడదీయరానిది. ఈ ఆలయానికి భక్తులలో ప్రాచుర్యం పొందిన ఒక విశ్వాసం ఉంది. దీని ప్రకారం సౌమ్యనాథ స్వామి ఆలయంలో త్రికరణ శుద్ధిగా 9 ప్రదక్షిణలు చేసి కోరికలు కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరతాయని, అనంతరం స్వామి వారికి కృతజ్ఞతగా అదే ఆలయంలో 108 ప్రదక్షిణలు చేయడం భక్తుల ఆనవాయితీగా వస్తుంది.

కొన్ని సంవత్సరాలు గా సౌమ్యనాథ స్వామి ఆలయ విశ్వాసం ప్రకారం స్వామివారిని దర్శించి సంకల్పం చేసుకోవడం 9 లేదా 11 ప్రదక్షిణలు చేసి తమ మొక్కు కోరుకోవడం జరుగుతుంది.కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి కృతజ్ఞతలు తెలుపడం జరుగుతు వస్తుంది. ఈ విశ్వాసం ఆలయానికి విశేష ఖ్యాతి తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. ఇలా కోరిన కోరికలు తీర్చే సౌమ్యనాధునిక స్వామి వారు వీరాజిల్లుతున్నారు ప్రస్తుతం ప్రత్యేక నిర్వహించే బ్రహ్మోత్సవాలు స్వామి వారి ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.