Sprouted Potatoes: మొలకెత్తిన బంగాళాదుంపలు నిజంగానే ఆరోగ్యానికి హానికరమా? వాస్తవం ఏంటి?

Updated on: Sep 02, 2025 | 6:03 PM

మొలకెత్తిన బంగాళదుంపలు తినాలా, వద్దా అనే విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే మొలకెత్తిన బంగాళదుంపలు విషపూరితమైనవని, వీటిని తినడం వల్ల కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం జరిగింది. దీని వల్ల వీటిని తినాలా వద్దా అనే చాలా మంది డౌట్‌లో ఉన్నారు. కాబట్టి ఇంతకు ఇందులో నిజం ఏంటి.. నిజంగానే మొలకెత్తిన బంగాళదుంపలు విషపూరితమైనవా అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5
బంగాళదుంపలను మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన సమయంలో లేదా ఇంట్లో నిల్వ చేసిన తర్వాత కొన్ని మొలకెత్తిన బంగాళాదుంపలు ఉంటాయి. అలా మొలకెత్తిన బంగాళదుంపలలో చాకోనిన్, సోలనిన్ ఉత్పత్తి అవుతాయి. పోషక విలువలు తగ్గడం మొదలు అవుతాయి.

2 / 5
మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల మరణించిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, కొన్ని అధ్యయనాలు అలాంటి సందర్భాలను నమోదు చేశాయి. కానీ బంగాళాదుంపకు గ్లైకోఅల్కలాయిడ్స్ చాలా ఎక్కువ సాంద్రత అవసరం. అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల తీవ్రమైన తక్కువ రక్తపోటు, వేగవంతమైన హృదయ స్పందన, జ్వరం, తలనొప్పి, గందరగోళం ఏర్పడతాయి.

3 / 5
ఇంతకు నిజం ఏమిటి:  మొలకెత్తిన లేదా పచ్చి బంగాళాదుంపలలో సోలనిన్, చాకోనిన్ అనే సహజ రసాయనాలు ఉంటాయనేది నిజం. వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్లా వికారం, వాంతులు, విరేచనాలు లేదా కడుపు నొప్పి వంటి ఇబ్బందులు రావచ్చు. అలాగే ఇది నాడీ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వీటిని తినొద్దని చెబుతున్నారు. కానీ ఒకటి లేదా రెండు చిన్న మొలకెత్తిన బంగాళదుంపలలో ఈ రెండు రసాయనాల చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి తిన్నా మరణం సంభవించేత ప్రమాదం మాత్రం ఉండదు. అయినా వీటిని తినకపోవడమే మంచింది.

4 / 5
 ఉల్లిపాయలు వాటిని మరింత విషపూరితం చేస్తాయా?: ఉల్లిపాయలు బంగాళదుంపలను విషపూరితం చేయవు. కానీ  రెండింటిని కలిపి నిల్వ చేయడం ద్వారా అవి త్వరగా చెడిపోయి మొలకెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిపుణులు వాటిని విడిగా ఉంచమని సిఫార్సు చేస్తారు.

5 / 5
అతిసారం, వాంతులు, కడుపు నొప్పికి కారణమయ్యే హానికరమైన సమ్మేళనాలు ఉంటాయి మరియు ప్రాణాంతకం కూడా కావచ్చు. మొలకెత్తిన బంగాళదుంపలను తినడం వలన కలిగే సమస్యలను గుర్తించి సరైన సమయంలో సరైన చికిత్స పొందకపోతే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది.