AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కొట్టిన టాప్‌ 10 క్రికెటర్లు వీరే! భారత్‌ నుంచి ఇద్దరు దిగ్గజాలు

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌ల్లో భారీ భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. తాజాగా బుధవారం ఇంగ్లండ్‌, ఆఫ్ఘానిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇరు జట్లు 300 ప్లస్‌ స్కోర్లు చేశాయి. రెండు టీమ్స్‌ నుంచి ఒక్కో ప్లేయర్‌ సెంచరీ సాధించాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ హిస్టరీలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఈ మ్యాచ్‌లోనే నమోదు అయ్యింది. అయితే.. మొత్తం ఛాంపియన్స్‌ ట్రోఫీలు కలుపుకొని.. అత్యధిక వ్యక్తిగత స్కోర్లు చేసిన టాప్‌ 10 క్రికెటర్లు ఎవరో ఇప్పడు చూద్దాం..

SN Pasha
|

Updated on: Feb 27, 2025 | 1:51 PM

Share
తొమ్మిదో ప్లేస్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగాక్కర ఉన్నాడు.  2013లో ది ఓవెల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంగా 134(నాటౌట్‌) పరుగులు సాధించాడు. అందులో 12 ఫోర్లు ఉన్నాయి. ఇక చివరిగా పదో ప్లేస్‌లో వెస్టిండీస్‌ మాజీ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ ఉన్నాడు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా జైపూర్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ 133(నాటౌట్‌) పరుగులు సాధించాడు. అందులో 17 ఫోర్లు, 3 ఫోర్లు ఉన్నాయి.

1 / 5
ఇక ఏడో స్థానంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ ఉన్నాడు. 2009లో సెంచూరియన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 141 పరుగులు సాధించాడు. అందులో 16 ఫోర్లు ఉన్నాయి. అలాగే ఎనిమిదో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌ ఉన్నాడు. 2009లో సెంచూరియన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్‌ 136(నాటౌట్‌) పరుగులు చేశాడు. అందులో 10 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి.

2 / 5
ఐదో స్థానంలో టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఉన్నాడు. 2000వ ఏడాది జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో నైరోబీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో దాదా 141(నాటౌట్‌) పరుగులు చేశాడు. అందులో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇక ఆరో స్థానంలో టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌, గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఉన్నాడు. 1998లో ఢాకా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ 141 పరుగులు సాధించాడు. అందులో 13 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

3 / 5
ఇక మూడో స్థానంలో నాథన్ ఆస్టిల్ ఉన్నాడు. ఈ న్యూజిలాండ్‌ ఆటగాడు 2004లో ది ఓవల్‌ వేదిక యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో 151 బంతుల్లో 145(నాటౌట్‌) పరుగులు చేశాడు. అందులో 13 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. నాలుగో స్థానంలో జింబాబ్వే దిగ్గజ క్రికెటర్‌ ఆండీ ఫ్లవర్‌ ఉన్నాడు. 2002 ఛాంపియన్స్‌ ట్రోఫీలో కోలంబో వేదికగా ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో 164 బంతుల్లో 145 పరుగులు సాధించాడు. అందులో 13 ఫోర్లు ఉన్నాయి.

4 / 5
ఇబ్రహీం జద్రాన్‌.. ఈ ఆఫ్ఘనిస్థాన్‌ ఓపెనర్‌ 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇంగ్లండ్‌తో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో 177 పరుగులు సాధించాడు. అందులో 12 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాటర్లలో ఇతనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాడు. రెండో ప్లేస్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ ఉన్నాడు. డకెట్‌ 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీలో లాహోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 165 పరుగులు చేశాడు. అందులో 17 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.

5 / 5