Hardhik Pandya’s House: ఇంద్రభవనాన్ని తలపిస్తున్న పాండ్యా సోదరుల ఇల్లు.. చూశారంటే వావ్ అనాల్సిందే..

మన దేశంలో క్రికెట్ కు విపరీతమైన ఆదరణ ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ దీనికి అభిమానులే. క్రికెట్ మ్యాచ్ లు జరిగినప్పుడు స్టేడియాలు జనాలతో కిక్కిరిసిపోతాయి. టిక్కెట్ల కోసం అభిమానులు స్టేడియం ముందు పడిగాపులు పడతారు. వారి రద్దీని నియంత్రించడానికి పోలీసులు రంగంలోకి దిగిన ఘటనలు అనేకం జరిగాయి. క్రికెట్ మ్యాచ్ లతో పాటు క్రికెటర్ల జీవిత విశేషాలపై కూడా ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. వారు వేసుకునే దుస్తులు, తిరిగే కార్లు, ఇళ్లు .. ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. క్రికెటర్ల వ్యక్తి గత విషయాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో అన్నదమ్ములైన కృనాల్ పాండ్యా, హార్థిక్ పాండ్యా నివసించే ఇల్లు, దానిలోని విశేషాలను తెలుసుకుందాం.

|

Updated on: Apr 08, 2024 | 1:39 PM

ఆల్ రౌండర్లు.. పాండ్యా సోదరుల పేర్లు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరేమో. అంతలా వారిద్దరూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. సామాన్య కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదిగి స్టార్ క్రికెటర్లు అయ్యారు. అనేక అంతర్జాతీయ మ్యాచ్ లలో అద్భుత ప్రతిభ కనబరిచి, ఇండియా విజయాలలో కీలక పాత్ర పోషించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోనూ తమదైన ముద్ర వేసుకున్నారు. ఆల్ రౌండర్లుగా అదర గొడుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో ప్రతిభ చూపుతూ ఎందరో అభిమానులను సంపాదించారు.

1 / 5
కళ్లు చెదిరే ఇల్లు.. గుజరాత్‌లోని వడోదరలో పాండ్యా సోదరులకు అద్భుతమైన పెంట్‌హౌస్ అపార్ట్‌మెంట్ ఉంది. సుమారు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్ మెంట్ ఎంతో అందగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకే అంతస్తులో నాలుగు వేర్వేరు ఫ్లాట్లను కలిపి దీనిని రూపొందించారు. దీని ఇంటీరియర్, స్లైల్ చూడటానికి రెండు కళ్లూ సరిపోవేమో అనిపిస్తుంది.

2 / 5
ఆధునికంగా.. అపార్ట్ మెంట్ లోని గదులను ప్రత్యేకంగా, మోడరన్ గా తమ అభిరుచులకు అనుగుణంగా పాండ్యా సోదరులు తీర్చిదిద్దుకున్నారు. స్టైల్ తో పాటు సంప్రదాయానికి ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా కృనాల్ పాండ్యా బెడ్ రూమ్ ఎంతో ఆధునికంగా ఉంటుంది. విశాలమైన బెడ్, దానికి మరింత అందాన్నిచ్చే రంగురంగుల బెడ్ షీట్లు, చుట్టూ కర్టెన్లు కొత్త అందాన్ని తీసుకువచ్చాయి. ఎదురుగా గోడకు ఉన్న టీవీ ఆ గది అందాన్ని మరింత పెంచింది.

3 / 5
అద్భుతం .. హార్దిక్ పాండ్యా బెడ్ రూమ్ కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. లోపల గోడపై ఉన్న ఫొటో గదికి నిండుతనం తీసుకువచ్చింది. తన సహచరులతో దిగిన చిత్రాన్నిపెద్ద ప్రేమ్ గా చేయించి బెడ్ రూమ్ లో పెట్టుకున్నాడు. గదిలో ఇంటిరీయర్ అద్భుతంగా ఉంటుంది.

4 / 5
వ్యూ అదిరింది.. అన్ని పండుగలను పాండ్యా సోదరులు కుటుంబంతో సహా ఘనంగా జరుపుకొంటారు. అదే విధంగా వారి టెర్రస్, బాల్కనీ కూడా చాలా ఆధునికంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది.

5 / 5
Follow us
Latest Articles