Habits: జీవితంలో సక్సెస్‌ అవ్వాలని ఉందా.? ఈ అలవాట్లను మార్చుకోండి..

జీవితంలో సక్సెస్‌ అవ్వాలని ఉందా.? ఈ ప్రశ్న అడిగితే ఎవ్వరైనా ఠక్కున ఉందనే చెబుతారు. విజయాన్ని కోరుకోని వారు ఎవరు ఉంటారు చెప్పండి. అయితే విజయం కోరుకున్నంత సులువు కాదు. ఇందుకోసం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఎన్నో అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. విజయం సాధించిన ప్రతీ ఒక్కరి వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి....

Habits: జీవితంలో సక్సెస్‌ అవ్వాలని ఉందా.? ఈ అలవాట్లను మార్చుకోండి..
Lifestyle
Follow us

|

Updated on: May 09, 2024 | 5:48 PM

జీవితంలో సక్సెస్‌ అవ్వాలని ఉందా.? ఈ ప్రశ్న అడిగితే ఎవ్వరైనా ఠక్కున ఉందనే చెబుతారు. విజయాన్ని కోరుకోని వారు ఎవరు ఉంటారు చెప్పండి. అయితే విజయం కోరుకున్నంత సులువు కాదు. ఇందుకోసం ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. ఎన్నో అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. విజయం సాధించిన ప్రతీ ఒక్కరి వెనకాల ఎన్నో కష్టాలు ఉంటాయి. అయితే ఆ కష్టాలను ఇష్టాలుగా స్వీకరిస్తేనే విజయం సొంతం చేసుకోవచ్చు. జీవితంలో విజయం సాధించాలంటే కచ్చితంగా కొన్ని రకాల అలవాట్లను మార్చుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* అందరికీ రోజులో ఉండేది 24 గంటల మాత్రమే. అయితే ఎవరు ఎక్కువగా ఆ సయాన్ని ఉపయోగించుకుంటారనేదే విజయాన్ని నిర్ణయిస్తుంది. ఇందుకోసం మొదట చేయాల్సింది ఉదయాన్నే త్వరగా మేల్కోవడం. 5 గంటలకు నిద్రలేవడాన్ని అలవాటు చేసుకోండి రోజులో ఎంత సమయం మిగులుతుందో మీరే గమనిస్తారు.

* విజయం సాధించే వారిలో ఉండే మరో లక్షణం పుసక్త పఠనం. జీవితంలో గొప్ప స్థానంలో ఉన్న వారికి కచ్చితంగా పుస్తకం చదివే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా మోటివేషనల్‌కు సంబంధించిన పుస్తకాలను చదవడం వల్ల మీలో ఉత్సాహం వస్తుంది. ఒక్కసారి పుస్తకం చదవడం చేసుకుంటే మీలో జరిగే మార్పును స్పష్టంగా గమనిస్తారు.

* ఇక జీవితంలో అనుకున్నది సాధించాలంటే ముందుగా మన ఆరోగ్యం బాగుండాలి. అందుకే సక్సెస్‌ అయిన ప్రతీ ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుంటారు. కచ్చితంగా ఉదయం వ్యాయామాలు చేస్తుంటారు. మంచి ఆహారం తీసుకుంటారు. రాత్రి సమయానికి నిద్రపోతారు. తక్కువ జబ్బులు పడేవారే ఎక్కువ పనిచేస్తారని గుర్తుంచుకోవాలి.

* మీ పక్కన ఉండే వారు కూడా పాజిటివ్‌ ఆలోచనతో ఉండే వారినే ఎంచుకోండి. అలాంటి వారితోనే స్నేహం చేయండి. కొందరు నిత్యం నెగిటివ్‌ ఆలోచనతో, నెగిటివ్‌ మాటలతో విసిగిస్తుంటారు. అలాంటి వారితో స్నేహం చేస్తే మీరు కూడా నెగిటివ్‌ దారిలోనే వెళ్తారు.

* జీవితంలో విజయం సాధించిన వారు ఎప్పుడైనా ఇతరులతో వాదనలకు దూరంగా ఉంటారు. వీలైనంత తక్కువ వాదిస్తుంటారు. ఎదుటి వ్యక్తితో వాదించే సందర్భంగా వచ్చినా సైలెంట్‌గా ఉంటారు తప్ప.. వాదనలకు దిగరు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే
సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే
వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును ఎందుకు పూజించాలంటే.. ?
వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును ఎందుకు పూజించాలంటే.. ?
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భారీగా పెరిగిన బ్యాంకింగ్ రంగం నికర లాభం.. పీఎం మోదీ కీలక ట్వీట్
భారీగా పెరిగిన బ్యాంకింగ్ రంగం నికర లాభం.. పీఎం మోదీ కీలక ట్వీట్
ఓటీటీ లవర్స్ కు పండగే.. ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే..
ఓటీటీ లవర్స్ కు పండగే.. ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే..
రాజస్థాన్ ఓటమి, బెంగళూరు గెలుపు పక్కా..
రాజస్థాన్ ఓటమి, బెంగళూరు గెలుపు పక్కా..
యువతితో ఈ ఐదు గుణాలు చేసి పెళ్లి చేసుకోమంటున్న చాణక్య
యువతితో ఈ ఐదు గుణాలు చేసి పెళ్లి చేసుకోమంటున్న చాణక్య
ఈపీఎఫ్‌ డెత్ క్లెయిమ్ కోసం కొత్త నియమం.. ఈ అప్‌డేట్ చేసుకోండి
ఈపీఎఫ్‌ డెత్ క్లెయిమ్ కోసం కొత్త నియమం.. ఈ అప్‌డేట్ చేసుకోండి
కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
కోల్‌కతా, హైదరాబాద్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వెదర్ రిపోర్ట్ ఇదే..
రేవ్ పార్టీలో హేమ కూడా..! ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు..
రేవ్ పార్టీలో హేమ కూడా..! ఫోటో రిలీజ్ చేసిన పోలీసులు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..