
భారత ఆటగాడు పంకజ్ అద్వానీ మళ్లీ ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్‌గా నిలిచాడు. దోహాలో జరుగుతున్న 19వ ఆసియన్ 100 UP బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ 2022 ఫైనల్‌లో భారత్‌కు చెందిన ధ్రువ్ సిత్వాలాను ఓడించి 8వ సారి టైటిల్‌ను గెలుచుకున్నాడు.

సిత్వాలా రెండుసార్లు ఆసియా బిలియర్డ్స్ ఛాంపియన్ సాధించాడు. అయితే ఈసారి ఫైనల్‌లో పంకజ్‌కి పోటీ ఇవ్వలేకపోయాడు.

ఐదో ఫ్రేమ్‌ను గెలుచుకున్న అద్వానీ 4-1తో ముందుకు సాగి ఆరో ఫ్రేమ్‌ను కూడా గెలుచుకున్నాడు. ఏడో ఫ్రేమ్ సిత్వాలాకు వెళ్లింది.

అంతకుముందు మయన్మార్‌కు చెందిన పోక్‌సాని ఓడించి అద్వానీ ఫైనల్‌కు చేరుకున్నాడు. అద్వానీకి ఇది 24వ అంతర్జాతీయ, ఎనిమిదో ఆసియా టైటిల్.