- Telugu News Photo Gallery Sports photos Mother's Day 2022: Those women of the sports world who have climbed the ladder of success even after giving birth to children
Mother’s Day 2022: పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా క్రీడాప్రపంచంలో సత్తా చాటిన సూపర్ తల్లులు
Mother's Day 2022: ప్రపంచంలో అత్యంత అందమైన బంధం తల్లిబిడ్డల బంధం. తల్లి తన బిడ్డ కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది. ఈ రోజు మనం క్రీడారంగంలో ప్రతిభ కనబరిచి.. స్త్రీలు.. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా తమ ప్రతిభను కొనసాగిస్తూ..ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నవారి గురించి తెలుసుకుందాం.
Updated on: May 08, 2022 | 10:21 AM

భారతీయ బాక్సింగ్‌లో అత్యున్నత శిఖరాన్ని తక్కువ సమయంలో చేరుకున్న మహిళ మేరీకోమ్. అంతర్జాతీయంగా 2001 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని గెలుచుకోవడం ద్వారా పతకాల వేట మొదలు పెట్టారు. ఆ తర్వాత 2002లో మేరీకోమ్ స్వర్ణ పతకం సాధించారు. మేరీ కోమ్ 2005లో ఫుట్‌బాల్ క్రీడాకారిణి కరుంగ్ ఓంఖోలార్‌ను వివాహం చేసుకున్నారు. రెండు సంవత్సరాల తరువాత మేరీకోమ్ రెచుంగ్వార్, ఖుప్నేవర్ కవల అబ్బాయిలకు తల్లి అయ్యారు. 2013లో, మేరీ కోమ్ తన మూడవ బిడ్డ ప్రిన్స్ చుంగ్తంగలాన్‌కు జన్మనిచ్చింది. 2018 సంవత్సరంలో, పాలిజిస్ట్ మార్లిన్ అనే పసికందును దత్తత తీసుకున్నారు.

సెరెనా విలియమ్స్- అమెరికన్ టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 23 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ సెరెనా ఎనిమిది వారాల గర్భవతిగా ఉన్నప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచారు. సెప్టెంబర్ 1, 2017న, విలియమ్స్ అలెక్సిస్ ఒలింపియా ఒహానియన్ జూనియర్ అనే కుమార్తెకు జన్మనిచ్చింది. తన బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, సెరెనా 2018, 2019లో వరుసగా వింబుల్డన్ ,US ఓపెన్ రెండింటిలోనూ ఫైనల్స్‌కు చేరుకున్నారు.

కిమ్ ఆంటోని లాడ్ క్లిజ్‌స్టర్స్ సింగిల్స్, డబుల్స్ రెండింటిలోనూ మాజీ ప్రొఫెషనల్ నం. 1 టెన్నిస్ క్రీడాకారిణి. జాక్ లియోన్ లించ్, కుమార్తె జాడా ఎల్లీ లించ్‌కు తల్లి. బెల్జియం 41 WTA సింగిల్స్ , 11 WTA డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. అంతేకాదు కిమ్ నాలుగు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. కిమ్ క్లిజ్‌స్టర్స్ మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత 2008లో US ఓపెన్‌ని గెలుచుకున్నారు.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆరు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను (డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో) గెలుచుకున్నారు. 2013లో సింగిల్స్ నుండి రిటైర్ అయ్యే వరకు భారతదేశంలో టెన్నిస్ నంబర్ 1 సింగిల్స్ ప్లేయర్. 2010లో ఆమె షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకుంది సానియా మీర్జా ఒక బిడ్డ జన్మించింది.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆరు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను (డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో) గెలుచుకున్నారు. 2013లో సింగిల్స్ నుండి రిటైర్ అయ్యే వరకు భారతదేశంలో టెన్నిస్ నంబర్ 1 సింగిల్స్ ప్లేయర్. 2010లో ఆమె షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకుంది సానియా మీర్జా ఒక బిడ్డ జన్మించింది.




