IPL 2024: ఓ ఇంటివాడు కాబోతున్న వెంకటేశ్ అయ్యర్.. ఫియాన్సీ ఎవరో తెలుసా?

మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. క్రికెటర్లు సెలబ్రిటీల కన్నా ఎక్కువ. ఎందుకంటే మన దేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక క్రీడ కాదు.. అంతకుమించి. ఒక ఆటగాడు ఒకటి రెండు మ్యాచ్ లు బాగా ఆడితే హీరో అయిపోతాడు.. అదే సమయంలో ఒకటి రెండు మ్యాచ్ లలో విఫలం అయితే విలన్లుగానూ మారిపోతాడు. అంతా పిచ్చి అభిమానం ఇక్కడ క్రికెట్ కు ఉంది. అందుకే క్రికెటర్ల జీవితంపై కూడా అభిమానులు అమితాసక్తి ఉంటుంది. వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఇటీవల మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు వెంకటేశ్ అయ్యర్. ప్రస్తుతం ఐపీఎల్-2024లో ఇరగదీస్తున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల వెంకటేశ్ నిశ్చితార్థం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఫొటోలను సైతం వెంకటేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ క్రమంలో వెంకటేష్ అయ్యర్ ఫియాన్సీ గురించి, వారి లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం..

|

Updated on: Apr 06, 2024 | 3:36 PM

ఐపీఎల్ లో కేకేఆర్‌ తరఫున ఆడుతున్న వెంకటేష్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు సైతం ఆడుతున్నాడు. ఇటీవల బెంగళూరుతో ఆడిన మ్యాచ్ ద్వారా కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున వెంకటేష్ అయ్యర్ 1,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.

1 / 5
వెంకటేష్ అయ్యర్ భారత జాతీయ జట్టుకు కూడా ఆడాడు. అయితే గత రెండేళ్లుగా ఫామ్ లేమి సమస్యతో జట్టుకు దూరం అయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్లో సత్తా చాటితే మళ్లీ జాతీయ జట్టులో చోటు సంపాదించే అవకాశం ఉంటుంది.

2 / 5
ఇటీవల వెంకటేష్ అయ్యర్ నిశ్చితార్థం జరిగింది. శృతి రఘునాథన్‌తో అనే యువతితో జరిగిన నిశ్చితార్థం ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే శృతిని అయ్యర్ ఎప్పుడు ఎలా కలిశారనే దానిపై పెద్దగా సమాచారం లేదు.

3 / 5
అయ్యర్ కాబోయే భార్య రఘునాథన్ గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండే యువతి. ఆమె పీఎస్జీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ నుంచి తన బీకామ్ డిగ్రీని పొందింది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ) నుంచి ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. ప్రస్తుతం, ఆమె బెంగళూరులోని లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మర్చండైజ్ ప్లానర్‌గా పనిచేస్తున్నారు.

4 / 5
ఇటీవల కేకేఆర్, ఆర్సీబీ మధ్య బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అయ్యర్ ఓ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. అది ఎవరికోసం అనేది మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సందర్భంగా వెల్లడించారు. ఆ సమయంలో తన ఫియాన్సీ అయిన శ‌ృతి స్టేడియంలోనే ఉందని, ఆమె కోసమే అలా చేశానని బదులిచ్చాడు.

5 / 5
Follow us
Latest Articles