- Telugu News Photo Gallery Sports photos Carlos Alcaraz beat novak djokovic and rafael nadal to reach madrid open final
Madrid Open: టెన్నిస్ దిగ్గజాలు నాదల్, జొకోవిచ్‌లకు షాకిచ్చిన 19 ఏళ్ల కుర్రాడు.. మాడ్రిడ్ ఓపెన్‌లో సరికొత్త చరిత్ర..
ఈ యువ ఆటగాడు టెన్నిస్ ప్రపంచంలోని ఇద్దరు గొప్ప ఆటగాళ్లను - రాఫెల్ నాదల్, నోవాక్ జొకోవిచ్‌లను ఓడించి ఆశ్చర్యపరిచడంతోపాటు మాడ్రిడ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించాడు.
Updated on: May 08, 2022 | 4:33 PM

స్పెయిన్‌కు చెందిన రాఫెల్ నాదల్, సెర్బియాకు చెందిన నొవాక్ జకోవిచ్‌లు టెన్నిస్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఆటగాడిగా నాదల్ సరికొత్త రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. అతని పేరు మీద 21 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ లిస్టులో జొకోవిచ్ రెండో స్థానంలో ఉన్నాడు. అతని పేరుపై 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ ఇద్దరిని ఓడించడం అంత సులభం కాదు. అయితే ఇది మాడ్రిడ్ ఓపెన్‌లో మాత్రం.. ఈ ఇద్దరు ఆటగాళ్లను ఓ 19 ఏళ్ల కుర్రాడు ఓడించాడు.

ఈ కుర్రాడు స్పెయిన్ నుంచి దూసుకొస్తు్న్న వర్ధమాన టెన్నిస్ ఆటగాడు. ఈ యువకుడి పేరు కార్లోస్ అల్కరాజ్. ఈ ఆటగాడు మాడ్రిడ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకుని, టెన్నిస్ ప్రపంచానికి షాక్ ఇచ్చాడు. ఈ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా నిలిచాడు.

సెమీ ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ ప్రపంచ నంబర్ 1 ఆటగాడు నొవాక్ జకోవిచ్‌ను ఓడించాడు. తొలి సెట్‌ను కోల్పోయిన కార్లోస్ అల్కరాజ్ పట్టు వదలకుండా మిగిలిన రెండు సెట్‌లను కైవసం చేసుకుని జకోవిచ్‌కు గట్టిపోటీ ఇచ్చాడు. సెమీఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ 6-7(5) 7-5 7-6(5)తో జొకోవిచ్‌ను ఓడించాడు.

అంతకుముందు క్వార్టర్ ఫైనల్స్‌లో కార్లోస్ తన సొంత దేశానికి చెందిన నాదల్‌ను ఓడించి, షాకిచ్చాడు. మూడు సెట్ల పాటు సాగిన ఈ మ్యాచ్ కూడా ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో కార్లోస్ 6-2, 1-6, 6-3 తేడాతో విజయం సాధించాడు. ఫైనల్‌లో అతను జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు. అతను గ్రీస్‌కు చెందిన స్టెఫానోస్ సిట్సిపాస్‌ను ఓడించి ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు.

ఒకే క్లే కోర్ట్ టోర్నీలో నాదల్, జొకోవిచ్ లాంటి దిగ్గజాలను ఓ ఆటగాడు ఓడించడం ఇదే తొలిసారి. నాదల్‌ను క్లే కోర్ట్ రాజు అంటారు. ఇటువంటి పరిస్థితిలో, వారిని ఓడించడం చాలా పెద్ద విషయం. కార్లోస్‌ను నాదల్ వారసుడిగా పేర్కొంటున్నారు.




