
ఎస్.ఆర్.హెచ్ ఎక్కడ ఆడుతున్నా అక్కడ వాలిపోయి.. జట్టును ఎంకరేజ్ చేస్తారు కావ్య. సినిమా హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందంతో అబ్బాయిలను ఫిదా చేస్తారు. కావ్య పేరు మీద ఎన్నో ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి.

SRH మ్యాచ్ సమయంలో కెమెరామ్యాన్స్.. ప్లేయర్స్ కంటే కావ్యపాప హావభావలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంటాడు. ఆటగాళ్లు అదరగొడుతుంటే.. ఎగురుతూ కేరింతలు కొట్టే కావ్య.. పేలవ ప్రదర్శన చేస్తుంటే మాత్రం.. నిరుత్సాహంతో కనిపిస్తూ ఉంటారు. సన్ గ్రూప్ మీడియా సంస్థల అధినేత కళానిధి మారన్ తనయే కావ్యా మారన్.

కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రమే కాకుండా.. పలు వ్యాపారాల్లో కూడా రాణిస్తున్న కావ్య.. బాగానే ఆస్తులు కూడబెట్టారు. ఆమె ఆస్తుల నికర విలువ దాదాపు 50 మిలియన్ల డాలర్లు ఉండొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి.

కావ్య మారన్ తమిళనాడులో 1992లో జన్మించారు. చెన్నైలోని స్టెల్లా మోరిస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అనంతరం ఫారెన్‌లో మాస్టర్స్ చేశారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీకి కో ఓనర్‌గా వ్యవహరిస్తున్న కావ్య.. సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్‌ఎం ఛానళ్ల వ్యవహారాలను కూడా చూస్తున్నారు.