uppula Raju |
Jan 01, 2022 | 10:37 PM
అరటి చెట్టు: ఈ చెట్టులో విష్ణువు నివసిస్తాడని, దీనిని పూజించడం ద్వారా ప్రసన్నుడవుతాడని నమ్ముతారు. అంతే కాదు శ్రీమహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందట.
బిల్వ వృక్షం: ఈ చెట్టుకు శివునికి ప్రత్యేక అనుబంధం ఉంది. శివ పూజ సమయంలో దీని ఆకులను సమర్పించడం చాలా శ్రేయస్కరం. శివపూజలో ఎప్పుడూ మూడు ఆకులను మాత్రమే ఉపయోగించాలని వాటి ఆకారం త్రిశూలంలా ఉండాలని చెబుతారు.
మర్రి: ఈ చెట్టును పూజించడం చాలా శుభప్రదం ఎందుకంటే మర్రి బ్రహ్మ, విష్ణువు, శివుని చిహ్నంగా పరిగణిస్తారు. సంతానం కలగాలంటే ఈ చెట్టును పూజిస్తే మంచిదని నమ్మకం.
రావి చెట్టు: భగవద్గీత ప్రకారం రావి చెట్టు ఉత్తమమైనది. దీని కింద ఆలయాల నిర్మాణం చేస్తారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ చెట్టును పూజిస్తే చాలా మంచిది.
ఉసిరి చెట్టు: ఉసిరి చెట్టులో శివుడు, విష్ణువు ఉంటారని ఈ చెట్టుని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, లభిస్తాయని నమ్ముతారు.