5 / 5
ఇంకో కారణం కూడా చెబుతారు పెద్దలు.. ఈ ఆషాడ మాసంలో అమ్మవారి జాతర్లు, ఎన్నో వ్రతాలు, పూజలు ఉంటాయి. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు చేయాల్సిన పురోహితులకు ఖాళీ ఉండదు. అందుకనే పూర్వకాలంలో ఈ మాసంలో పెళ్లిళ్లు చేసేవారు కాదు. తొలకరి జల్లుల నుంచి రైతులు వ్యవసాయ పనుల్లో బిజిబిజీ అవుతారు. దీంతో ఈ నెలలో ఫంక్షన్ల కోసం పనుల కోసం సమయం కేటాయించడం ఆ రైతులకు కష్టం కనుక పూర్వ కాలం నుంచి ఆషాఢంలో శుభకార్యాలను నిర్వహించక పోవడం ఆచారంగా వస్తోంది. అయితే ఇప్పటికీ ఇదే ఆచారాన్ని సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఆషాడ మాసంలో ఎలాంటి శుభకార్యాలను కానీ, పెళ్లిలను కానీ నిర్వహించరు.