
కొన్ని సార్లు శని గ్రహం కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. దీనిని ఏలినాటి శని అంటారు. ఒక వ్యక్తి జన్మ రాశిలో 12,1,2 స్థానాల్లో సంచరిస్తుంది. దీని వలన ఆ రాశి వారు అనేక ఇబ్బందుల ఎదుర్కోవాల్సి వస్తుంది . అయితే 2026లో 12 రాశుల్లో మూడు రాశులపై ఏలినాటి శని ప్రభావం ఉండనుంది. దీని వలన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

2026లో అర్థ ని ప్రభావం కొనసాగుతుంది. దీని వలన కొన్ని రాశుల వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. అంతే కాకుండా, రాహు, కేతు గ్రహాల ప్రత్యేక ప్రభావం కూడా చూపనున్నాయి. కాగా, ఈ ఏలి నాటి శని ప్రభావం, కారణంగా ఏ రాశుల వారు ఎక్కువ ప్రభావితం కానున్నారు? ఏ రాశుల వారికి ఏలి నాటి శని చివరి దశలో ఉంది? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి వారికి ఏలి నాటి శని మొదటి దశ కొనసాగుతుంది. ఇది వీరికి చాలా గట్టు కాలం అనే చెప్పాలి. ఈ రాశి వారు ఏలి నాటి శని ప్రభావం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆర్థికంగా ఎక్కువగా నష్టపోయే ఛాన్స్ ఉంది. అదే విధంగా కుటుంబంలో శాంతి లోపిస్తుంది. కుటుంబ కలహాలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే ఈ రాశి వారు 2026లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

మీన రాశి : మీన రాశి వారికి ఏలి నాటి శని ప్రభావం మొదటి దశ కొనసాగుతుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరంలో మానసిక ఒత్తిడితో సతమతం అవుతారు. అంతే కాకుండా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఎంత కష్టపడి పని చేసినా, కష్టానికి తగిన ప్రతి ఫలం లభించదు. కుటుంబ సమస్యలు అధికం అవుతాయి. ఉద్యోగులు ఎంత కష్టపడి పని చేసినా, ఫలితం లభించదు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. అందువలన ఈ రాశి వారు శని దేవుడిని ప్రార్థించడం చాలా మంచిది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ కొనసాగుతుంది. ఈ సమయంలో వీరి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఎవరు అయితే గత కొంత కాలం నుంచి కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్నారో, వారికి మంచి పరిష్కారం లభిస్తుంది. ఆర్థికంగా కూడా గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. మానసికంగా, ఆరోగ్యపరంగా కొంత కలిసి వస్తుంది. అయితే ఈ రాశి వారు చివరి దశలో చాలా వరకు ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిది.