ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): తృతీయ స్థానంలో శని, భాగ్య, దశమ స్థానాల్లో బుధు, రవి, శుక్రుల సంచారం వల్ల ఉద్యోగంలోనే కాక, వృత్తి, వ్యాపారాల్లోనూ ఆశించిన పురోగతి ఉంటుంది. నిరుద్యోగులతో పాటు, ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ముఖ్యమైన పనుల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోక పోవడం మంచిది. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా సమస్యలు ఎదురవుతాయి. సమాజంలో పలుకు బడికి లోటుండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడు తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరు గుతుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రతి రోజూ గణపతి నామ స్మరణ మంచిది.