- Telugu News Photo Gallery Spiritual photos Weekly Horoscope 05 October 2025 to 11 october 2025 check your astrological predictions in telugu
Weekly Horoscope: ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (అక్టోబర్ 5-11, 2025): మేష రాశి వారికి ఈ వారం ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. వృషభ రాశి వారు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?
Updated on: Oct 05, 2025 | 5:01 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు, ప్రయత్నాలు అనుకున్నట్టు జరిగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాక, ఆర్థికంగా కూడా ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగులకు అధికార యోగం ఉంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులు విదేశాల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. తండ్రి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): శుభ గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొద్ది శ్రమతో పెండింగ్ పనులన్నిటిని పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరువవుతుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆదాయానికి లోటుండక పోవచ్చు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): శుభ గ్రహాల అనుకూలత వల్ల వారమంతా హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం వల్ల ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. పెండింగు పనులను కూడా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఒక శుభ కార్యంలో బంధుమిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు రాబడి పరంగా విజయవంతంగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు చదువుల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో కూడా లాభాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా సాగిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేయవద్దు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది. అయితే, షేర్లు, స్పెక్యులేషన్లు మాత్రం బాగా లాభిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. మాటకు, చేతకు విలువ పెరుగు తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. స్వల్ప అనారోగ్యాలు, శ్రమాధికత్యత, తిప్పట కూడా తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. లాభాలపరంగా వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి పనిభారం తప్పకపోవచ్చు. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభముంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో వీలైనంత జాగ్ర త్తగా ఉండడం మంచిది. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు చాలా వరకు రొటీనుగా సాగిపోతాయి. ధన యోగం పట్టే సూచనలున్నాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో, శుభ కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదరాభిమానాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెడతాయి. కొత్త వ్యాపారాల మీద దృష్టి సారిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. పిల్లల పురోగతికి సంబంధించి శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి మంచి ఆఫర్ అందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో చక్కబడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, ఆశ్లేష): ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. రావలసిన సొమ్మును, బాకీలను కొద్ది ప్రయత్నంతో రాబట్టుకుంటారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా ఫలితం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. బంధువుల వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబ వ్యవహారాలు సజావుగా చక్కబడతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అన్ని పనులు, వ్యవహారాలు అనుకున్నట్టే పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయబ వంతం అవుతుంది. ఏ రంగానికి చెందినవారికైనా సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు చాలావరకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. సర్వత్రా మాట చెల్లుబాటవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): వారమంతా సానుకూలంగా సాగిపోతుంది. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. సొంత పనులు, వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగంలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. బాధ్యతల విషయంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారడానికి ఇది అనుకూల సమయం. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబ పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. మనసులోని కోరిక ఒకటి సాకారం అవుతుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, సానుకూలంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాల విషయంలో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పడతారు. స్వల్ప అనారోగ్య సమస్యలుం టాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు సమయం బాగా అను కూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులుంటాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారుల్ని ఆకట్టుకుంటారు. వ్యాపారాలు నిలకడగా పురోగమి స్తాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, కుటుంబ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొన్ని అనుకోని ఇబ్బందులు, సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది. ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులలో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.



