1 / 8
ప్రతి సంవత్సరం భాద్ర మాసంలోని శుక్ల పక్షం చతుర్థి తిథి రోజుని వినాయకుని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 వ తేదీ శనివారం రోజున వినాయక చవితిని జరుపుకోనున్నారు. వినాయక చవితి రోజున భక్తులు ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. ఆది దైవంగా పూజలను అందుకునే వినాయకుడికి ఇష్టమైన వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని గణేష్ పూజ సమయంలో సమర్పిస్తారు. ముఖ్యంగా ఈ ఏడు వస్తువులు లేని పూజ అసంపూర్ణంగా పరిగణిస్తారు. గణపతి బప్పను ప్రసన్నం చేసుకోవడానికి పూజ కోసం నియమాల ప్రకారం ఉపయోగించాల్సిన వస్తువులు ఏమిటంటే