
ఈ నెల 8వ తేదీ నుంచి శుక్ర గ్రహం సింహ రాశిలో సంచారం ప్రారంభించడం, దానిని మేషరాశి నుంచి గురుగ్రహం వీక్షించడం వల్ల చాలా రాశుల వారికి పెళ్లి ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. ఇది పెళ్లి ప్రయత్నాలకు మాత్రమే అనుకూల సమయం. పెళ్లి విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి ఆగస్టు 17 వరకు ఆగవలసి ఉంటుంది. పెళ్లి విషయంలో వివిధ రాశుల వారు ఏ విధమైన ప్రయత్నాలు చేయవలసి ఉందీ ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది.

మేషం: ఈ రాశి వారికి వచ్చే పౌర్ణమి తరువాత నుంచి పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా పరిచయస్తుల ద్వారా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకోకుండా పెళ్లి సంబంధం తెలియటం, ప్రయత్నించడం జరుగుతుంది. శ్రావణ మాసంలో లేదా తప్పకుండా కార్తీక మాసంలో పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లోగా సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వినే అవకాశం కూడా ఉంది.

వృషభం: ఈ రాశి వారికి వ్యయ స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల పెళ్లి ప్రయత్నాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నవంబర్ లోగా పెళ్లి ప్రయత్నాలు చేపట్టకపోవడం కూడా మంచిది. పెళ్లి ప్రయత్నాలలో స్పందన లభించక పోవడం, సానుకూలంగా జరగకపోవడం, చికాకులు ఎదురుకావడం వంటివి జరిగే అవకాశం ఉంది. కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ నవంబర్ తరువాత బంధు వర్గంలో వివాహం కుదిరే అవకాశం ఉంది.

మిథునం: లాభ స్థానంలో గురు గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారు ఇప్పుడు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టడం మంచిది. శ్రావణమాసంలో కానీ, కార్తీక మాసంలో గానీ తప్పకుండా వివాహం జరిగే అవకాశం ఉంది. సాధారణంగా తెలిసిన వారితో లేక ఇష్టపడిన వారితో వివాహం అయ్యే సూచనలు ఉన్నాయి. ఇదివరకు ప్రయత్నం చేసి వదిలేసిన సంబంధం తిరిగి వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లోగా సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశి వారికి ప్రస్తుతం శుక్ర గ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల, పెద్దగా పెళ్లి ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేకుండానే మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సాధారణంగా ఇష్టపడిన వారితో లేక సహచరులతో పెళ్లి నిశ్చయం అయ్యే సూచనలు ఉన్నాయి. కార్తీక మాసంలో రవి, శుక్ర గ్రహాలు మరింతగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆ సమయంలో పెళ్లి వ్యవహారం పూర్తయ్యే అవకాశం ఉంది.

సింహం: ఈ రాశిలో ఈనెల 8 నుంచి శుక్ర గ్రహ సంచారం ప్రారంభం కావడం వల్ల, దీనిని గురు గ్రహం వీక్షించడం వల్ల ఈ నెలలో పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. రెండు మూడు నెలల్లో పెళ్లి పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఇష్టపడిన వారితో పెళ్లి నిశ్చయం కావచ్చు. పెళ్లి కోసం పెద్దగా ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. శుభగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల పెళ్లి విషయంలో కొద్ది పాటి ప్రయత్నం కూడా సఫలం అవుతుంది.

కన్య: ఈ రాశి వారికి గురు శుక్ర గ్రహాలు ఆశించినంతగా అనుకూలంగా లేనందువల్ల పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన కలసి రాకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాలను వచ్చే ఏడాదికి వాయిదా వేయటం మంచిది. పెళ్లి ప్రయత్నాలలో చికాకులు, ఇబ్బందులు ఎదు రయ్యే అవకాశం ఉంది. సాధారణంగా నవంబర్ నెల తరువాత బంధువుల సహాయ సహకారా లతో పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే సూచ నలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత పెళ్లి వ్యవహారం పూర్తయ్యే అవకాశం ఉంది.

తుల: ప్రస్తుతం గురు, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. అవివాహితులకు పెళ్లి సమయం దగ్గర పడిందని భావించవచ్చు. శ్రావణమాసంలో లేదా కార్తీక మాసంలో పెళ్లి పూర్తి కావచ్చు. బంధు వర్గంలోనే నచ్చిన వారితో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. నిజానికి పెళ్లి విషయంలో ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఏప్రిల్ 24వ తేదీలోగా సంతానానికి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది.

వృశ్చికం: పెళ్లి ప్రయత్నాల విషయంలో ఈ రాశి వారు ఆచి తూచి వ్యవహరించడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ముందుకు వెళ్లడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలను ఫిబ్రవరి వరకు వాయిదా వేయడం మంచిది. వైశాఖ మాసంలో పెళ్లి అయ్యే అవకాశం ఉంది. పెళ్లికి సంబంధించిన శుభగ్రహాలు అయిన గురు శుక్ర గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల పెళ్లి ప్రయత్నాల విషయంలో ఆటంకాలు అవరోధాలు ఎదురు కావచ్చు. బంధు వర్గంలో సంబంధం కుదిరే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశి వారికి వచ్చే పౌర్ణమి తరువాత నుంచి పెళ్లి ప్రయత్నాలు అనుకూలించడం ప్రారంభం అవుతుంది. సాధారణంగా పెద్దగా ప్రయత్నం లేకుండానే పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్నేహితులు, సహచరులు, పరిచయస్తు లతో పెళ్లి కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా కార్తీక మాసంలో పెళ్లి వ్యవహారం పూర్తి కావచ్చు. గురు శుక్ర గ్రహాలు బాగా అను కూలంగా ఉన్నందువల్ల మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశి వారికి ఈ ఏడాది పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి. పెళ్లికి సంబంధించిన శుభగ్రహాలు అనుకూలంగా లేనందువల్ల పెళ్లి ప్రయత్నాలలో ఇబ్బందులు ఎదురు కావడం, విపరీతంగా ఆలస్యం కావడం, స్పందన లభించకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. సాధారణంగా తెలిసిన వారి ద్వారా పెళ్లి సంబంధం కుదిరి సూచనలు ఉన్నాయి. వచ్చే ఏడాది వైశాఖ మాసంలో పెళ్లి అయ్యే అవకాశం ఉంది.

కుంభం: పెళ్లికి సంబంధించిన గురు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల పెళ్లి ప్రయత్నాలు చేపట్టడం మంచిది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా తప్పకుండా పెళ్లి వ్యవహారం పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. నవంబర్ లోగా పెళ్లి ప్రయత్నాలు సఫలం కావచ్చు. బంధువుల సహాయంతో మంచి పెళ్లి సంబంధం కుదరటం జరుగుతుంది. కుంభ రాశిలో శని సంచారం కారణంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగించ వలసి ఉంటుంది.

మీనం: గురు గ్రహం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల నవంబర్ లోగా తప్పకుండా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి పెళ్లి ప్రయత్నా లను ముమ్మరం చేయటం మంచిది. పూర్తిగా అపరిచితులతో పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. శుక్ర గ్రహం కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నందువల్ల తక్కువ ప్రయ త్నంతో అనుకోకుండా వివాహం నిశ్చయం అవుతుంది. బంధువుల నుంచి లేదా సహచరుల నుంచి సహాయ సహకారాలు లభించే సూచనలు ఉన్నాయి.