Vastu Tips: ఇంట్లోకి ఈ పక్షుల రాక శుభ చిహ్నం.. సుఖ సంపదలను ఇచ్చే లక్ష్మీదేవి అనుగ్రహానికి సూచన..

|

Aug 03, 2023 | 8:59 AM

హిందూ మతంలో మొక్కలను, జంతువులను, పక్షులను పూజిస్తారు. ప్రకృతిని భగవంతుని స్వరూపంగా కూడా భావిస్తారు. అంతేకాదు కొన్ని జంతువులు, పక్షులు నిజ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంపదకు సూచికలుగా నమ్ముతారు. కొన్ని రకాల పక్షులను పెంచుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతాడు.

1 / 6
పురాణాల మత గ్రంథాల్లో సంపదకు అధినేత లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలు చెప్పబడ్డాయి. ఈ రోజు ఆర్ధిక ప్రయోజనాలు, సుఖ సంతోషాలను కలిగించే పక్షులకు సంబంధించిన కొన్ని సంకేతాల గురించితెలుసుకుందాం.. కొన్ని రకాల పక్షాలు ఇంటికి రాక చాలా శుభప్రదంగా భావిస్తారు.

2 / 6
వాస్తు శాస్త్రం ప్రకారం గుడ్లగూబను సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఎవరికైనా గుడ్లగూబ కనిపిస్తే అది శుభ సూచకంగా పరిగణిస్తారు. అంతేకాదు గుడ్లగూబ కనిపించడం రానున్న కాలంలో ఐశ్వర్యం, శ్రేయస్సు ,  ఆనందం లభిస్తాయని ఇది సూచనగా భావిస్తారు. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. లక్ష్మిదేవి సంపద, శ్రేయస్సు, అదృష్టానికి చిహ్నం.

3 / 6
ఇంట్లోకి  రామ చిలుక రావడం శుభసూచకంగా భావిస్తారు.  రామ చిలుకలను ఐశ్వర్యం, శ్రేయస్సు కు  చిహ్నంగా చూస్తారు. చిలుక డబ్బు సంపాదించడానికి శుభ సందేశంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం రామ చిలుక సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది.

4 / 6
వాస్తు శాస్త్రం ప్రకారం కాకుల రాక ఇంటికి శుభప్రదం. అతిథుల రాక గురించి హెచ్చరించడానికి కాకులు ఇంటికి వస్తాయని నమ్ముతారు. అలాగే, భవిష్యత్తులో మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సు ను అవి కోరుకుంటాయని విశ్వాసం. 

5 / 6
గరుడపక్షికి హిందూ సనాతన ధర్మంలో ప్రముఖ స్థానం ఉంది. వైష్ణవ మతంలో గరుడ పక్షి అని పిలువబడే నీలకంఠ పక్షి. హిందూ మతంలో ఈ పక్షిని విష్ణువు లేదా నారాయణుని వాహనంగా పరిగణిస్తారు. అంతేకాదు గరుత్మంతుడు సకల దేవతల రక్షకుడిగా పరిగణిస్తారు. నీలకంఠుని రాకను వైష్ణవ మతంలో శుభ సంకేతంగా భావిస్తారు. అంతేకాదు ఇది ఆనందం, శ్రేయస్సు , అదృష్టానికి శుభసూచకంగా పరిగణిస్తారు. 

6 / 6
ఇంటికి తెల్ల పావురం రావడం శుభ సంకేతం. తెల్ల పావురం రాక ఒక శుభ సందేశాన్ని తెస్తుందని విశ్వాసం. ఇంటి పైకప్పు మీద కూర్చుని తెల్లని పావురం కూయడం ఇంటికి శ్రేయస్కరమని భావిస్తారు. 