లోహ తాబేలు - లోహపు తాబేలును ఉత్తరం లేదా వాయువ్య దిశలో ఉంచాలి. ఇది ఉత్తర దిశలో ఉంచినప్పుడు, ఇది పిల్లల జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తుంది. వారి ఏకాగ్రతని మెరుగుపరుస్తుంది. అయితే తాబేలును వాయువ్య దిశలో ఉంచడం వల్ల పిల్లల తెలివితేటలు పెరుగుతాయి.
చెక్క తాబేలు - వాస్తు శాస్త్రం ప్రకారం, చెక్క తాబేలును తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూలశక్తి తొలగిపోతుంది. అంతేకాదు మీకు అత్యంత ప్రియమైనవారి జీవితంలో ఆనందం, అదృష్టం, విజయాలను నింపుతుంది.
స్ఫటిక తాబేలు నైరుతి లేదా వాయువ్య దిశలో క్రిస్టల్ తాబేలు ఉంచడం ప్రయోజనకరం. ఫెంగ్ షుయ్ ప్రకారం..స్ఫటిక తాబేలుని నైరుతిదిశలో ఉంచడం వల్ల మీ జీవితంలో సంపద లభిస్తుంది. అయితే స్ఫటిక తాబేలుని వాయువ్య దిశలో పెడితే కీర్తిని తెస్తుంది.
మట్టి తాబేలు - మీ ఇంటికి తూర్పు లేదా ఆగ్నేయ దిశలో చెక్క తాబేలును ఉంచడం వల్ల జీవితం శాంతి, సుఖ సంపదలతో సాగిపోతుంది. మట్టి తాబేలును ప్రవేశ ద్వారం వద్ద ఉంచడం వల్ల మీ ఇంటిని ప్రతికూల శక్తి నుండి సురక్షితంగా ఉంటుంది.