Bedroom Vastu: పడకగదిలో కొన్ని రకాల మొక్కలను పెంచుకోవడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఆందోళన, ఒత్తిడి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
లావెండర్ ప్లాంట్: లావెండర్ ఒక ఇండోర్ మొక్క కనుక దీని మెయింటనెన్స్ చాలా తేలిక. దీన్ని పడకగదిలో ఉంచితే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని నుంచి వచ్చే సువాసన కూడా బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అలాగే బెడ్ రూమ్‌లోని గాలిని శుభ్రం చేస్తుంది.
రబ్బర్ ప్లాంట్: రబ్బర్ ప్లాంట్ కూడా ఇండోర్ ప్లాంట్, దీన్ని ఇంట్లో ఏ మూలన అయినా సులభంగా పెంచుకోవచ్చు. వాస్తు ప్రకారం ఈ రబ్బర్ మొక్కను పడక గదికి ఆగ్నేయ దిశలో ఉంచాలి, తద్వారా ఆర్థిక పరిస్థితి, దాంపత్య జీవితం కూడా మెరుగుపడుతుంది.
లిల్లీ మొక్క: లిల్లీ మొక్క శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పడకగదిలో ఉంచితే చెడు కలలు తొలగి మంచి నిద్ర వస్తుంది. పడకగదిలో ఉంచడం వల్ల ఆర్ధిక రాబడికి సానుకూలత లభిస్తుంది.
మనీ ప్లాంట్: పడకగదిలో మనీ ప్లాంట్ ఉంచడం వాస్తు శాస్త్రం ప్రకారం శుభప్రదం. ఇది పడక గదిలో ఉంటే ఆ ఇంటికి ధన ప్రవాహం జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు.