ఈ దిశలో నాటాలంటే : వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంటికి తూర్పు, ఉత్తరం , ఈశాన్య దిశలో నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ దిశను దైవిక దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో శంఖాకర పువ్వుల మొక్కను నాటడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ప్రధాన ద్వారానికి కుడివైపున ఈ మొక్కను నాటడం కూడా చాలా మంచిదని భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో శుభ ఫలితాలు, సంతోషం వెల్లివిరుస్తాయి. అయితే, ఈ మొక్కను ఎప్పుడూ పశ్చిమ లేదా దక్షిణ దిశలో నాటకూడదు.