Vastu Tips: క్రిస్టల్ తాబేలుని ఇంట్లో పెట్టుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెలుసా.. ఆ పొరబాటు చేయకండి..

|

Dec 17, 2024 | 3:41 PM

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించుకోవడమే కాదు ఇంటిలోని వస్తువులను కూడా వాస్తు ప్రకారం పెట్టుకోవడం శుభప్రదం అని నమ్మకం. ఎక్కువ మంది వస్తు దోష నివారణకు వివిధ చర్యలు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి వస్తు దోషాలు ఉంటె తొలగడానికి పలు రకాల వస్తువులను పెట్టుకుంటారు. అటువంటి వస్తువుల్లో ఒకటి క్రిస్టల్ తాబేలు. వాస్తు ప్రకారం మాత్రమే కాదు ఫెంగ్ షూయిలో కూడా తాబేలు ప్రతిమకు ప్రత్యేక స్థానం ఉంది.

1 / 7
పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువు అవతారాల్లో ఒకటి కూర్మావతారం. సముద్ర మథనం సమయంలో మంధర పర్వతం మునిగిపోకుండా కూర్మావతారం దాల్చాడు. అందుకనే శ్రీ మహావిష్ణువు ప్రతి రూపంగా కూర్మావతారాన్ని పూజిస్తారు. ఇంట్లోని తాబేలు ఉంటె సుఖ శాంతులు నెలకొంటాయని.. విషయం సొంతం అవుతుందని విశ్వాసం. అయితే ఒకొక్క తాబేలుకి ఒకొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు ఇంట్లో క్రిస్టల్ తాబేలు పెట్టుకోవడం వలన కలిగే ఫలితాలు.. ఏ దిశలో పెట్టుకోవడం శుభప్రదమో తెలుసుకుందాం..

2 / 7
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో క్రిస్టల్ తాబేలుని పెట్టుకోవడానికి కొన్ని నియమాలున్నాయి. ఆ నియమానుసారంగా పెట్టుకునే మంచి జ‌రుగుతుంది.  క్రిస్టల్ తాబేలు ఇంట్లోని వారికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది.

3 / 7

ఇంట్లో సరైన దిశ‌లో క్రిస్టల్ తాబేలును పెట్టడం వాస్తు దోషాలు తొలగి ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మ‌న‌కు దీర్ఘాయువును అందిస్తుంది.

4 / 7
తాబేలు సంపదని సూచిస్తుంది. వాస్తు ప్రకారంఇంట్లో లేదంటే దుకాణాల్లో  ఇంటికి ఉత్తర దిశలో క్రిస్టల్ తాబేలు పెట్టుకోవాలి. ఈ చర్యల వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.  ఆర్ధికంగా బలపడతారు. ఎందుకంటే ఈ ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు. కనుక క్రిస్టల్ తాబేలు ఉత్తర దిశ‌ను చూస్తున్నట్లు పెట్టాల్సి ఉంటుంది.

5 / 7
ఎవరైనా ఇంట్లోని కుటుంబ స‌భ్యుల మధ్య కలహాలు ఉన్నా,  అనారోగ్య సమస్యలతో బాధ‌ప‌డుతున్నా.. క్రిస్టల్ తాబేలు మంచి పరిష్కరం. దీనిని ఉత్తర దిశ‌లో పెట్టాలి. ఇలా చేయడం వలన ఇంట్లో కలహాలు తీరి సుఖ శాంతులు నెలకొంటాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

6 / 7
భార్య భర్తల మధ్య వివాదాలు ఉన్నా, బంధువుల‌తో క‌ల‌హాలు ఉన్నా.. సంబంధాలు బలపడడానికి క్రిస్టల్ తాబేలుని తాబేలును ఇంట్లో నైరుతి దిశ‌లో పెట్టుకోవాలి. అయితే ఉత్తమ ఫలితాల కోసం  క్రిస్టల్ తాబేలు మీద నేరుగా సూర్య రశ్మి పడకుండా పెట్టుకోవాల్సి ఉంటుంది.

7 / 7
ఇంట్లో వాట‌ర్ ఫౌంటెయిన్ ఉంటే దాని పక్కన క్రిస్టల్ తాబేలుని పెట్టుకోవడం ఎంతో మంచిది అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి సమస్యలున్నా బయట పడతారని.. సర్వత్రా విజయాన్ని అందుకుంటారని.. పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతున్నారు. అయితే పొరపాటున కూడాక్రిస్టల్ తాబేలుని ఆగ్నేయం, ఈశాన్యం దిక్కుల్లో పెట్టుకోవద్దని సూచిస్తున్నారు.