
విరిగిన విగ్రహాలు.. వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిన విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు. ఇవి ఇంట్లో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. ఈ విషయం గురించి వాస్తు శాస్త్రంలోనే కాకుండా.. జ్యోతిషశాస్త్రంలో కూడా ఉంది.

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి... లక్ష్మీ దేవి శుభ్రంగా లేని ఇంట్లో ఉండదు అని పెద్దలు చెబుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిత్యం శుభ్రం చేసుకోవడం వలన ఆర్థిక సమస్యలను తగ్గించుకోవచ్చు.

సాయంత్రం లైట్స్ వెలిగించాలి... వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం సమయంలో ఇంటిని చీకటిగా ఉంచకూడదు. సాయంత్రాల్లో ఇంట్లో కాంతిని ఉండనివ్వాలి. అందుకోసం సూర్యాస్తమయం సమయంలో లైట్లు తప్పనిసరిగా వెలిగించాలి.

ఇంట్లో వ్యర్థ మందులను ఉంచకూడదు. మందులు ఉంచడం వల్ల మరిన్ని వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం పనికి రాని మందులను ఇంట్లో ఉంచకూడదు.

ఇంట్లో పడవులు మునిగిపోవడం.. యుద్ధానికి సంబంధించిన ఫోటోలు ఉంచకూడదు. వీటివలన ప్రతికూల ఆలోచనలు వస్తాయి. అలాగే మనస్సులో ఉద్రిక్తత, నిరాశ కలుగుతుంది.

వాస్తు శాస్త్రం..