
తెల్ల పులి: వాస్తు శాస్త్రం ప్రకారం హింసాత్మక, దూకుడు జంతువుల చిత్రాలను ఇంట్లో ఉంచకూడదు. అయితే వాస్తు శాస్త్రంలో తెల్ల పులిని శుభప్రదంగా పేర్కొంది. ఇంటి పడమర గోడపై తెల్లటి పులి చిత్రాన్ని ఉంచినట్లయితే, ఆ ఇల్లు చెడు దృష్టి నుంచి రక్షించబడుతుంది. అలాగే ఇంటిపై ఎలాంటి దుష్ట శక్తుల ప్రభావం ఉండదని విశ్వాసం.

సముద్రం,ప్రవహించే నీరు: ప్రవహించే నీటి బొమ్మను ఇంట్లో ఉంచడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అలాంటి బొమ్మను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతి పని పూర్తి అవుతుందని కుటుంబ సభ్యుల అదృష్టం బలపడుతుందని విశ్వాసం. అంతేకాదు సంపద పెరిగే సంకేతాలు కూడా ఉన్నాయని నమ్ముతారు.

చేపల చిత్రం: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అక్వేరియం ఉంచడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఇంట్లో అక్వేరియం లేకపోతే, మీరు ఇంట్లో అక్వేరియం ఫోటో లేదా చేపల చిత్రాన్ని ఉంచవచ్చు. చేపల చిత్రాలను ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుందని విశ్వాసం

పర్వతాలు- పెద్ద భవనాలు: కొండలు, కోనలు, పెద్ద భవనాలు, చెట్ల చిత్రాలను ఇంటి నైరుతి మూలలో ఉంచాలి. ఇలాంటి చిత్రాలు మీ జీవితంలో స్థిరత్వాన్ని కలిగిస్తాయని మరియు మీ విశ్వాసాన్ని మరియు శక్తిని పెంచుతాయని అంటారు. అయితే ఈ చిత్రాలలో జలపాతం లేదా నది ఉండకూడదని గుర్తుంచుకోవాలి.

అందమైన మహిళ చిత్రం : వాస్తు ప్రకారం టి ఆగ్నేయ మూలలో అందమైన స్త్రీ బొమ్మను ఉంచవచ్చు. ఇది వాస్తు శాస్త్రంలో మంచిగా పరిగణించబడుతుంది.

గరుడ పక్షిల ఇంట్లో గరుడ పక్షి ఫోటో పెట్టడం వాస్తు ప్రకారం చాలా మంచిది. గరుడ పక్షి ఆధ్యాత్మిక కోణం నుంచి కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. గరుడ పక్షి ఫోటోను ఇంట్లో ఉంచడం వల్ల మీ సంపద, బలం, స్థిరత్వం కూడా పెరుగుతుంది.

రాధాకృష్ణులు: రాధా-కృష్ణుల చిత్రాన్ని ఇంటి మాస్టర్ బెడ్‌రూమ్ లోని వాయువ్య మూలలో ఉంచాలి. ఇది వైవాహిక జీవితంలో ప్రేమను కొనసాగించడంలో సహాయపడుతుంది.

కుబేర్ ఫోటో: కుబేరుని ఫోటోను ఉత్తరం వైపు ఉంచాలి. అంతే కాకుండా సూర్యుని ఫోటోను తూర్పున పెట్టడం మంచిదని భావిస్తారు. వాస్తు ప్రకారం, ఇది ఇంట్లోకి డబ్బు రావడానికి మార్గం తెరుస్తుంది