Tirumala: శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. సుగంధం ద్రవ్యాలతో ఆలయాన్ని శుభ్రం చేసిన అర్చకులు..

|

Jan 11, 2022 | 12:13 PM

Tirupati:తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ ఉదయం శాస్త్రోక్తంగా నిర్వహించింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయాన్ని శుద్ధి చేశారు. దీంతో ఉదయం 11 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. అంతేకాదు ఈరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసింది.

1 / 4
ఈనెల 13న పవిత్ర వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సంప్రదాయబద్ధంగా శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. తెలుగు ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి ముందు ఏడాదికి నాలుగుసార్లు ఈ ఆగమ ఘట్టాన్నినిర్వహించడం సంప్రదాయంగా వస్తుంది.

2 / 4
తిరుమల ఆలయంలో ఉన్న గర్భాలయ, ఇతర ఉపాలయాల పైకప్పులు, గోడలపై పరిమళం అనే ప్రత్యేక సుగంధ మిశ్రమాన్ని పూస్తారు. ఇది క్రిమిసంహారకంగా కూడా పనిచేస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఉత్సవం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

3 / 4
అయితే రేపు వైకుంట ఏకాదశి దర్శనం కోసం వచ్చే స్వామివారి భక్తులకు గదులను కేటాయించేందుకు రెడీ చేయాల్సిన అవసరం ఉందని...అందుకనే తిరుమలలో ఈరోజు గదులను కేటాయించడం లేదని ఈవో చెప్పారు.

4 / 4
భక్తులు అన్ని కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. టిటిడి నిర్వహణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమంజనం కార్యక్రమంలో లకమండలి సభ్యుడు మధుసూధన్ యాదవ్, ఆలయ డీఈవో   రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.