ఉగాది స్పెషల్ భక్ష్యాలు: బెల్లం లేదా చక్కెర.. ఎలా చేస్తే అదిరిపోతాయో తెలుసా?

Updated on: Mar 08, 2026 | 3:50 PM

ఉగాది పండుగ, శ్రీ పరాభవ నామ సంవత్సరం మార్చి13 నుంచి ప్రారంభం కాబోతుంది. ఉగాది పండుగ అంటే ప్రతి పల్లె, పట్నంలో సందడి నెలకొంటుంది. చాలా ఆనందంగా తెలుగు ప్రజలు అందరూ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది పచ్చడి, రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. ఇక ముఖ్యంగా ఈరోజు భక్ష్యాలు తప్పనిసరిగా చేస్తారు. కాగా, ఈ స్పెషల్ రిసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం.

1 / 5
భక్ష్యాలను చక్కెర, బెల్లం రెండింటితో తయారు చేస్తారు. చాలా మందికి వీటిని బెల్లం లేదా చక్కెర దేనితో తయారు చేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనే డౌట్ ఉంటుంది. అయితే రెండింటితో మంచి టేస్ట్ ఉంటుంది. కానీ బెల్లంతో చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. అందువలన చాలా వరకు బెల్లంతో తయారు చేసుకోవడం చాలా మంచిది.

2 / 5
బెల్లంతో భక్ష్యాలు తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు : శనగపప్పు రెండు కప్పులు, యాలకుల పొడి, మైదా పిండి రెండు కప్పులు, గోధుమ పిండి మూడు టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము రెండు కప్పులు, నెయ్యి అర కప్పు, ఉప్పు చిటికెడు.

3 / 5
తయారీ విధానం : ముందుగా శనగపప్పు శుభ్రంగా కడిగి నానబెట్టాలి.  తర్వాత పప్పును మిక్సీలో వేసి చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి.  మూడు విజుల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి, రెండు కప్పుల బెల్లం తురుము వేసి, మీడియం సైజు మంటపై ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత, యాలకుల పొడి వేసి, దీనిని ముద్దలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు మైదా పిండి తీసుకొని, అందులో గోధుమ పిండి వేసి,  నీళ్లు, నెయ్యి వేసి మంచిగా చపాతీపిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతి పిండిని చిన్న ముద్దల్లా చేసుకొని, వాటి మధ్యలో ఉడకబెట్టిన శనగపిండి, బెల్లం మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దాల్లా పెట్టి, పూరీల సైజులో ఒత్తుకోవాలి.

5 / 5
ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, కాస్త నెయ్యి వేసి,  మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలి. బంగారు రంగులో వచ్చే వరకు కాల్చుకుంటే, వేడి వేడి ఉగాది స్పెషల్ భక్ష్యాలు రెడీ.

Follow Us