
శ్రీరామచంద్రుని భక్తుల్లో అగ్రగణ్యుడు శ్రీ హనుమంతుడు. హనుమంతుడు అజేయుడు, అజరామరుడు, అమరుడని చెబుతారు. కలియుగ దైవంగా పూజలను అందుకుంటున్నాడు. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు

కలియుగంలో పిలిస్తే పలికే దైవం ఈ హనుమంతుడని చెబుతారు. పురాణ గ్రంధాల ప్రకారం మంగళవారం, బజరంగబలికి అంకితం చేయబడిండి. ఈ ప్రత్యేక రోజున శ్రీరామచంద్రునితో పాటు హనుమాన్ ని పూజిస్తారు. మంగళవారాల్లో ఉపవాసం ఉండి బజరంగ్ బలిని పూజించడం వల్ల కుజ గ్రహ దోషం తొలగిపోతుందని నమ్మకం.

అంతేకాదు జీవితంలో జరిగే చెడు పనుల నుండి దూరంగా ఉండటానికి, శత్రువుల నుంచి రక్షణ కోసం బజరంగ బలిని పూజిస్తారు. బజరంగబలిని పూజించడానికి నియమాలను అనుసరించడం అవసరం. కొన్ని పనులు చేయడంపై ఆంక్షలు ఉన్నాయి.

జ్యోతిష్కుడి ప్రకారం హనుమంతుడు శ్రీరాముడి భక్తుడు. బ్రహ్మచారి. కలియుగం దైవంగా పురాణ గ్రంధాలలో వర్ణించబడ్డాడు. మంగళవారం హనుమంతుడి ని పూజించిన భక్తులు పొరపాటున మాంసం తినరాదు. మద్యం లేదా మత్తు పదార్థాలను సేవించకూడదు.

మంగళవారం హనుమంతుడితో పాటు శ్రీరాముడిని కూడా పూజిస్తారు. ఈ రోజున బజరంగ బలిని పూజించడం వల్ల మంగళ దోషం తొలగిపోతుందని నమ్ముతారు. ఈ రోజున భక్తులు ఎవరినీ అవమానించరు. ముఖ్యంగా బిచ్చగాళ్లు, పేదలు, అనారోగ్యం, వికలాంగులు లేదా వృద్ధులను గౌరవించండి. హనుమాన్ పూజ అంగారకుడి చెడు దృష్టిని తొలగిస్తుంది.

శ్రీరామచంద్రుడిని, హనుమంతుడిని పూజించడంతో పాటు శివుడిని కూడా మంగళవారం పూజించాలి. ఈ రోజున భక్తుడు శివుని పూజించకపోయినా, అవమానించకూడదు. శివుడిని తక్కువగా చూసే భక్తుల పట్ల హనుమాన్ కు కోపం వస్తుందట. సమస్యల సుడిగుండంలో చిక్కుంటారట.

హనుమంతుని భక్తులు మంగళవారం బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటించాలి. అంతేకాదు తల్లి, సోదరి, కుమార్తె , భార్యతో పాటు ఇతర స్త్రీలను కూడా దైవ స్వరూపంగా భావించాలి. గౌరవించాలి.