Tirupati: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రేపు రూ. 300 టికెట్ కోటాను రిలీజ్ చేయనున్న టీటీడీ.. ఏ సమయంలోనంటే

|

Aug 23, 2021 | 7:24 PM

Tirupati: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం తిరుమల తిరుపతి. శ్రీవారి ని దర్శించుకుని తమ మొక్కలు తీర్చుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు క్యూ కడతారు. అయితే కోవిడ్ ఎఫెక్ట్ అన్నిరంగాలపై పడినట్లు.. స్వామివారి ఆలయదర్శనంపై కూడా పడింది. దీంతో భక్తుల దర్శనానికి నిబంధనలను టీటీడీ అధికారులు అమలు చేస్తున్నారు.

1 / 4
తిరుమల తిరుపతి మలయప్ప స్వామివారి భక్తులకు అలర్ట్.. స్వామివారి దర్శనం కోసం ఆగస్టు 24న రూ.300 దర్శన టికెట్ల సెప్టెంబర్ నెల కోటా విడుదల చేయనుంది.

2 / 4
స్వామివారి భక్తుల సౌకర్యార్థం సెప్టెంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఉదయం 9 గంటలకు టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

3 / 4
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరింది.

4 / 4
 రోజుకు 5 వేల చొప్పున టికెట్లను విడుద‌ల చేస్తారు. అయితే ఈ టికెట్ల సంఖ్యను పెంచకుండా యథాతధంగా దర్శనాలు కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.