
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భారీ విరాళం అందింది.

దాదాపు రూ.2.45 కోట్లువిలువజేసే నాలుగు కేజీల బంగారాన్ని శ్రీవారికి విరాళంగా ఇచ్చి స్వామిపై ఉన్న భక్తిని చాటుకుంది చైన్నైకు చెందిన భక్తురాలు సరోజా సూర్యనారాయణ.

4,150 గ్రాముల వజ్రాలు పొదిగిన యజ్ఞోపవీతం, లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా ఇచ్చింది ఆమె.

దీంతో పాటూ చైన్నైలో రూ.3.50 కోట్లు విలువజేసే స్థలాన్ని కూడా విరాళంగా అందించింది.

శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలను అందించింది భక్తురాలు సరోజా సూర్య నారాయణ.