అయితే వెంకన్న భక్తలే టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్నారు కొందరు దుండగులు. టోకెన్ల కోసం, సమాచారం కోసం, విరాళాల ఇచ్చేందుకు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను నిత్యం లక్షల మంది సందర్శిస్తారు.
ఈ క్రమంలో కొందరు నకిలీ వెబ్ సైట్లను ప్రారంభించి.. భక్తులను మాయ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తాజాగా భక్తులకు సూచించింది టీటీడీ.
TTD
ఆ ఫేక్ వెబ్‌సైట్‌ను నమ్మి మోపోవద్దని భక్తులను టీటీడీ కోరింది. ఇలాంటి పనులు చేసేవారి ఆట కట్టించేందుకు విజిలెన్స్ టీమ్ రంగంలోకి దిగిందని.. పోలీసులకు కూడా కంప్లైంట్ చేసినట్లు వివరించింది. ఐటీ విభాగం నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించి తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా ఏపీ ఫోరెన్సిక్ సైబర్ సెల్ కూడా నకిలీ వెబ్‌సైట్‌పై విచారణ చేపట్టింది.
TTD అధికారిక వెబ్‌సైట్‌లోనే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదులు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అలానే అధికారిక యాప్‌ను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఇప్పటివరకు టీటీడీ పేరుతో ఉన్న 41 నకిలీ వెబ్‌సైట్లపై పోలీసులకు కంప్లైంట్ చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.