
మేషం: లాభ స్థానంలో ఈ త్రిగ్రాహి యోగం కలుగుతున్నందువల్ల అనేక విధాలుగా ఈ రాశివారికి ధన లాభాలు కలిగే అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. ప్రముఖులతో లాభదాయక సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో శని, బుధ, రవుల యుతి ఏర్పడడం వల్ల ఉద్యోగ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది.

సింహం: రాశినాథుడు రవి సప్తమ స్థానంలో శని, బుధులతో యుతి చెందడం వల్ల సాధారణంగా ఏ ప్రయ త్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. రాజకీయంగా ప్రాముఖ్యం సంపాదించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు సఫలం అవు తారు. ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటారు. వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగిపో తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.

తుల: ఈ రాశికి పంచమ స్థానంలో ఈ మూడు గ్రహాలు కలవడం వల్ల ఆదాయం విశేషంగా వృద్ది చెందు తుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమ వుతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు మెరుగైన స్థితికి చేరు కుంటాయి. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి. ఉద్యోగంలో సమర్థతకు ఆశించిన గుర్తింపు లభించి హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి.

ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతున్నందువల్ల రెండు వారాల పాటు జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఒకటి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ది చెందుతుంది. ప్రయాణాలు, పర్యటనల వల్ల ఇబ్బడిముబ్బడిగా లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.

మకరం: ఈ రాశికి ధన స్థానంలో శని, బుధ, రవులు కలుస్తున్నందువల్ల ఆదాయం దిన దినాబివృద్ధి చెందుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. విజయాలు, సాఫల్యాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొన్ని పెండింగ్ సమస్యలు చాలావరకు పరి ష్కారమవుతాయి. ఎక్కువ సంఖ్యలో శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతులు లభి స్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.