Toe Rings: పెళ్ళైన స్త్రీలకు ఎందుకు మెట్టెలు తొడుగుతారో తెలుసా..! దీని వెనుక సైంటిఫి రీజన్ ఏమిటంటే?
హిందూ వివాహ వేడుకలో అనేక సంప్రదాయాలున్నాయి. నుదిటిన బొట్టు, మేడలో నల్లపూసలు, తాళి, గాజులు, మెట్టెలు వంటివాటిని వధువు ధరిస్తుంది. మెట్టెలు, నల్లపూసలు ధరించిన స్త్రీలను వివాహిత అని గుర్తిస్తారు. అయితే మన సంప్రదాయంలో ఒక్క నియమానికి ఒక శాస్త్రీయ కోణం దాగుంది. అదే విధంగా కాలి వేలుకు పెట్టె మెట్టెల విషయంలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పురాతన కాలం నుండి కొనసాగుతున్న ఈ సాంప్రదాయం వెనుక మీరు నమ్మినా నమ్మకపోయినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవును ఇది నిజం.. కనుక ఈ రోజు కాలి వేలుకి మెట్టెలు ఎందుకు ధరించాలి? అది కూడా కాలి బొటన వేలు పక్కన ఉన్న వెలికి ఎందుకు ధరిస్తారు. ఈరోజు తెలుసుకుందాం..