
సంవత్సరానికి ఒకసారి మాత్రమే రాజమండ్రి దీనికి చౌక్ లో ఉన్న జగన్నాథ స్వామి దర్శనం జరుగుతుంది. అందుకే ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు చేరుకొని విష్ణు మూర్తిని దర్శించుకుంటారు. అంతే కాకుండా, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. కాగా, ఈ ఆలయం ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి లో ఉండే జగన్నాథ స్వామి వారి ఆలయం తొలి ఏకాదశి రోజు మాత్రమే తెరుస్తారు. అయితే నేడు తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ తలుపులు తెరిచారు. దీంతో ఆలయం తెరిచిన వెంటనే, భక్తులకు ప్రవేశం కల్పించారు ఆలయ నిర్వాహకులు, దీంతో కిలోమీటర్ల మేర క్యూ లైన్‌లలో భక్తులు వేచి ఉన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దేవి చౌక్ లో సంవత్సరం తర్వాత తొలి ఏకాదశి పర్వదినాన జగన్నాథ స్వామి ఆలయ తలుపులు తెరిచారు ఆలయ నిర్వహకులు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు జగన్నాథ స్వామి దర్శనం కల్పిస్తారు.దీంతో పెద్ద ఎత్తున క్యూలైన్లో బారులు తీరారు భక్తులు.

కొన్నేళ్లుగా తాతల కాలం నుంచి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఆలయ నిర్వహకులు. వారి కుటుంబ సభ్యులు మాత్రమే ధూప దీప నైవేద్యాలు నిత్యం పెట్టడానికి అనుమతి ఉంటుంది. మిగితా రోజుల్లో ఈ ఆలయంలోకి వె ళ్లడానికి భక్తులకు అనుమతి ఉండదు. తొలి ఏకాదశికి మాత్రమే భక్తులకు ఆలయంలోకి అనుమతిస్తారు.