Khairatabad Ganesh: పండక్కు ముస్తాబవుతున్న ఖైరతాబాద్ వినాయకుడు.. ఈసారి ఎన్ని అడుగులో తెలుసా..?

|

Aug 25, 2021 | 12:07 PM

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడు... వినాయక చవితి పండుగకు ముస్తాబవుతున్నాడు. గత ఏడాది కరోనా కారణంగా.....

1 / 5
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడు... వినాయక చవితి పండుగకు ముస్తాబవుతున్నాడు. గత ఏడాది కరోనా కారణంగా ధన్వంతరి రూపంలో...9 అడుగులకే వినాయకుడు పరిమితమైన విషయం తెలిసిందే.

2 / 5
 అయితే ఈ ఏడాది మళ్ళీ పూర్వ వైభవం రానుంది. 40 అడుగుల ప్రతిమతో భక్తులను కనువిందు చేయనున్నాడు గణేశుడు

3 / 5
 2 నెలలుగా... చెన్నై, మహారాష్ట్ర , తెలంగాణ నుంచి 100 మంది కార్మికులతో తయారు చేస్తున్న విగ్రహం..ఈరోజుతో దాదాపు పూర్తి అవుతుంది.

4 / 5
రేపటి నుంచి విగ్రహాలకు రంగులద్దనున్నారు. సెప్టెంబర్ 10వ రోజున శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి రూపంలో వేలాది భక్తులకు దర్శనమివ్వనున్నాడు.

5 / 5
ఈ ఏడాది విగ్రహాన్ని తయారు చేయడానికి 70 నుంచి 80 లక్షలు ఖర్చు చేస్తున్నామని, ఇది అందరి వినాయకుడిని, అందరూ వచ్చి ఆశీస్సులు తీసుకోవాలని ఖైరతాబాద్ గణేష్ మండప నిర్వాహకులు కోరుతున్నారు.