
మేష రాశి : మేష రాశి వారికి కేతువు ప్రభావం వలన అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందదు. దీంతోసమస్యలు పెరుగుతాయి. కుటుంబంలో కూడా గొడవలు జరగడం, ప్రారంభించిన పని మధ్యలోనే ఆగిపోవడం ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ కొనసాగుతుంది. ఈ క్రమంలో వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ క్రమంలోనే కేతువు చెడు దృష్టి కూడా వీరిపై పడనుంది. దీంతో ఉద్యోగంలో ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. అంతే కాకుండా ప్రయాణాలు వాయిదా పడటం, అధికారుల నుంచి విభేదాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వంటివి చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి . అందువలన ఈ రాశి వారు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా మెదలడం అవసరం.

మీన రాశి : మీన రాశి వారికి కేతు ప్రభావంతో ప్రారంభించన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. అంతే కాకుండా ఉద్యోగ ప్రయత్నాలు నిరాశకు గురి చేస్తాయి. బంధంలో చీలికలు, మనశ్శాంతి లేకపోవడం వంటి అనేక ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు